19వ ఆటా సభలకు బాల్టిమోర్ రెడీ! ఎన్నారైలకు ఆహ్వానం
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:13 PM
మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో నేటి సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ప్రారంభం కానున్న ఆటా 19వ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో నేటి సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ప్రారంభం కానున్న ఆటా 19వ మహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 70 కమిటీలకు చెందిన వాలంటీర్స్ అహర్నిశలూ కృషి చేశారని ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ, విద్య, వైద్య, అలుమ్ని, బిజినెస్ సెమినార్లు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు, సినీనటుడు రాజేంద్రప్రసాద్, తాజా-మాజీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే బాల్టిమోర్ చేరుకున్నారు. భీమ్స్ సిసిరోలో, హీరోయిన్ రీతూ వర్మ, పూజా హెగ్డే, పాల్గొననున్నారు. కీరవాణి బృందం సంగీత విభావరి అలరించనుంది. శ్రీ శివ పార్వతుల కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఫాషన్ షో, నిరావాల్ బ్యాండ్ లైవ్ కన్సర్ట్, ఆటా బ్యూటీ పజంట్, యూత్ ఫాషన్ షో, అష్టావధానం, లిటరరీ కాంఫరెన్సెస్, యూత్ క్రూయిజ్, ఆటా మాట్రిమోనీ తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.

నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవల్సిందిగా ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డిలు కోరారు. 1991లో స్థాపించిన ఆటా 35 వసంతాలుగా అటు మాతృదేశంతో పాటు ఇటు అమెరికాలో కూడా పలు సాంస్కృతిక, సామజిక, సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.



ఈ వార్తలనూ చదవండి:
సౌదీలో హైదరాబాదీ రోగిని ఆదుకున్న మలయాళీ!
ఎడారినాట కాపుల బాట.. దుబాయిలో ముద్రగడకు నివాళి