Share News

AAVGF ఆధ్వర్యంలో అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో 2K వాక్

ABN , Publish Date - Oct 28 , 2026 | 07:38 PM

అమెరికా రాజధాని పరిధిలో నడక - ఆరోగ్యం - ఆనందం - సమాజ సేవ అనే నినాదంతో సమిష్టి కార్యాచరణ, సమగ్ర అవగాహన కోసం AAVGF సంస్థ 2కే వాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

AAVGF ఆధ్వర్యంలో అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో 2K వాక్
AAVGF - 2K Walk

మాతృభూమి మాతృబాష తెలుగువారికి రెండు కళ్లు. వృత్తి ఉపాధి రీత్యా వేల మైళ్ల దూరంలో ఉంటున్నా, మాతృభూమిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్య, వైద్య రంగాలలో అక్షరాస్యత, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషణ ప్రాతిపదికగా చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది అడాప్ట్ ఆ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ సంస్థ (AAVGF). రెండు తెలుగు రాష్ట్రాలలో 42 క్లస్టర్లలో 120 గ్రామాలను దత్తత తీసుకుని ప్రాథమిక అవసరాలను గుర్తించి వివిధ సేవలను అందిస్తూ లక్షలాదిమంది తెలుగు ప్రవాసులందరికీ స్ఫూర్తినిస్తోంది.

అమెరికా రాజధాని పరిధిలో నడక - ఆరోగ్యం - ఆనందం - సమాజ సేవ అనే నినాదంతో సమిష్టి కార్యాచరణ, సమగ్ర అవగాహన కోసం AAVGF సంస్థ 2కే వాక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉదయం 10 గంటలకు మొదలై, సాయంత్రం 4 గంటల వరకూ జరిగిన కార్యక్రమంలో సంస్థ విధి విధానాలు, కార్యాచరణ, స్వచ్ఛ నీరు, మెడికల్ క్యాంపులు, కుష్టు వ్యాధి నిర్మూలన, మన ఆరోగ్యం మన చేతుల్లో ఇలా పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ, చిన్నారులకు వినోద కార్యక్రమాలు నిర్వహించారు.

3.jpg


సంస్థ ప్రతినిధులు డా. భూపతిరాజు పందేటి, చంద్రశేఖర రాజు ముప్పాళ్ల మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, హరిత భారత్, వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న అందరి మూలాలు గ్రామీణ ప్రాంతాలతో ముడిపడ్డాయని, జన్మభూమికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఆ ఆలోచనల్లో నుండి పుట్టిన వేదికే AAVGF అని తెలిపారు. జిల్లా కలెక్టర్‌లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్వాహకుల అంకితభావం, సభ్యుల సమయం, శ్రమతో స్ఫూర్తిదాయకంగా సంవత్సరాలుగా గ్రామాల దత్తతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. మాతృబాష తెలుగు పరిరక్షణ కూడా అందరి భాద్యత అని తెలిపారు.

4.jpg


తెలుగు పాఠశాల అధ్యక్షుడు భానుప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ, ఏదేశ మేగినా.. మాతృభూమిని, మాతృభాషను కాపాడుకోవటమే తమందరి విధిగా ప్రవాసులు భావించాలని అన్నారు. ప్రవాస తెలుగు వారందరూ తమ గ్రామ, ప్రాంతాలకు తిరిగి ఇవ్వటం అనే గొప్ప సందేశాత్మక కార్యాచరణ మానవత్వ విలువలనూ, సామాజిక భాధ్యతనూ నేటి యువతరానికి గుర్తుచేస్తుందని అన్నారు. ఈ సత్సంప్రదాయ విలువను, అవసరాన్ని తెలుపుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ప్రభాకర్ రాజు, సునీల్, ప్రియాంక, భాస్కర్ రాజు, రామ్, రవి పులిగోటి, గిరి, ప్రవీణ్ ముప్పాళ్లలతో స్థానిక పెద్దలు మన్నే సత్యనారాయణ, ఎండూరి సీతారామారావు, చింతా రాంబాబు, రామ్మోహన్ రెడ్డి, అన్నం పూర్ణచంద్రరావు, సురేష్ రాజు, నర్సి రెడ్డి, వెంకట్రావు, రాజేందర్ పాల్గొన్నారు.

AAVGF - 2K Walk


ఈ వార్తలనూ చదవండి:

ఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువ

చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

Updated Date - Oct 28 , 2026 | 07:49 PM