దేవీ నవరాత్రులు
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:27 AM
శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు.
నేటి అలంకారం: శ్రీ అన్నపూర్ణాదేవి ఆశ్వయుజ శుద్ధ తదియ,
మంగళవారం
శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. అన్నపూర్ణాదేవి సాక్షాత్తూ శివ స్వరూపిణి, ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత. అమృతాన్నంతో ఉన్న బంగారు పాత్రను, వజ్రాలు పొదిగిన గరిటను ఆమె ధరించి ఉంటుంది. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుందంటారు. ఆమెను కుంకుమతో పూజించాలి. జ్ఞానభిక్ష పెట్టాలని, వైరాగ్యం కలగజేయాలని కోరుకోవాలి. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించిన వారికి మేధాశక్తి కలుగుతుందని భక్తుల నమ్మిక. ఈ తల్లిని ధ్యానిస్తే ధన , ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు.
నైవేద్యం: కట్టె పొంగలి, పరమాన్నం
అలంకరించే చీర రంగు: ఎరుపు
అర్చించే పూల రంగు: తెలుపు
పారాయణ: అన్నపూర్ణాష్టకం, స్తోత్రాలు