Share News

పిల్లల్లో మలబద్దకమా..?

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:38 AM

శారీరక శ్రమ తగ్గడం, పోషకాహారలోపం తదితర కారణాల వల్ల పిల్లల్లో మలబద్దకం సమస్య పెరుగుతోంది. దీన్ని నివారించేందుకు జాగ్రత్తలివే...

పిల్లల్లో మలబద్దకమా..?

గంటల తరబడి మొబైల్‌ లేదా టీవీ చూస్తూ కూర్చోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించి మలబద్దకం పెరుగుతుంది. రోజూ సాయంత్రంపూట గంటసేపు పిల్లలను ఆరుబయట ఆడుకోనివ్వాలి. దానివల్ల జీవక్రియల వేగం పెరుగుతుం ది. అలాగే సైక్లింగ్‌, స్కిప్పింగ్‌, వాకింగ్‌లాంటి తేలికపాటి వ్యాయామాలను పిల్లలచేత చేయించడం ప్రయోజనకరం.

దాహం వేయకపోయినా పిల్లలు తరచూ నీళ్లు తాగేలా చూడాలి. రోజూ కనీసం అయిదారు గ్లాసులు తాగాలి. పలుచని మజ్జిగ, తాజా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, సూప్‌లను తాగించాలి.

అన్ని రకాల ఆకుకూరలతోపాటు దోసకాయ, చిక్కుడు, క్యారెట్‌, బీరకాయ, సొరకాయ, మునగకాడలు, టమాటాలు, క్యాప్సికమ్‌ తదితర కూరగాయలను విధిగా భోజనంలో చేర్చాలి. తరచూ నారింజ, యాపిల్‌, స్ట్రాబెర్రీ, బొప్పాయి, జామ, అరటిపండ్లను తినిపిస్తుండాలి. అవిసె గింజలు, పప్పులు, తృణధాన్యాలు ఆహారంలో ఉండేలా చూడాలి. పీచు అధికంగా ఉండే పల్లీలు, నువ్వులు, బాదం, వాల్‌నట్స్‌తోపాటు మొలకలను సాయంత్రంపూట స్నాక్స్‌లో చేర్చాలి.

Updated Date - Nov 28 , 2026 | 12:40 AM