మధ్య రాత్రి మెలకువ వస్తోందా!
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:12 AM
మధ్య రాత్రి వేళ మెలకువ వచ్చి మరల నిద్ర పట్టకపోతే ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం...
మధ్య రాత్రి వేళ మెలకువ వచ్చి మరల నిద్ర పట్టకపోతే ఏ చిట్కాలు పాటించాలో చూద్దాం...
పడక గదిలో లైటింగ్ లేకుండా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. పడుకునేచోట నిశ్శబ్దంగా చీకటిగా ఉన్నప్పుడే నిద్ర బాగా పడుతుంది.
మధ్య రాత్రి వేళ మెలకువ వస్తే వెంటనే సమయాన్ని చూడకూడదు. అలా చూస్తే ఒత్తిడి పెరుగుతుంది. ఉదయాన్నే నిద్ర లేవాల్సిన సమయానికి అలారం పెట్టుకుని పడుకోవాలి. అలారం మోగే వరకు మధ్యలో ఎన్నిసార్లు మెలకువ వచ్చినా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రించడానికి ప్రయత్నించాలి.
పావుగంట దాటినా నిద్ర పట్టకపోతే వేరే గదిలోకి వెళ్లి కొద్దిసేపు సంగీతం విన్నా, ఏదైనా పుస్తకం చదివినా వెంటనే నిద్ర వచ్చేస్తుంది.
ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు యోగ, ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర బాగా పడుతుంది. రోజూ అరగంట తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది.
రాత్రి భోజనం మితంగా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తీసుకోవాలి. డైటింగ్ పేరుతో సరిగా తినకపోయినా, పరిమితికి మించి తిన్నా నిద్ర సరిగా పట్టదు.
పడుకోవడానికి రెండు గంటలముందు భోజనాన్ని ముగించాలి. భోజనం చేసిన తరువాత కొద్దిసేపు వాకింగ్ చేయాలి. టీవీ, మొబైల్ చూడకూడదు. మధ్య రాత్రి మెలకువ వస్తుందనిపిస్తే పగటిపూట పడుకోకూడదు.