నేడు ముద్దపప్పు బతుకమ్మ
ABN , Publish Date - Oct 12 , 2026 | 02:50 AM
తెలంగాణ పూల జాతర బతుకమ్మ సంబరాల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ముద్దపప్పును ప్రధానంగా నివేదన చేస్తారు.
తెలంగాణ పూల జాతర బతుకమ్మ సంబరాల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ముద్దపప్పును ప్రధానంగా నివేదన చేస్తారు. కాబట్టి గౌరమ్మను ‘ముద్దపప్పు బతుకమ్మ’గా పూజిస్తారు. ఈ రోజున మందార, చేమంతి , రామబాణం తదితర పూలను మూడు ఎత్తుల్లో పూలను పేరుస్తారు. వాటి పైభాగంలో గౌరమ్మను ఉంచి ఆరాధిస్తారు.
నైవేద్యం: ముద్దపప్పు, పాలు, బెల్లంతో చేసిన వంటకాలు