Share News

డైనింగ్‌ టేబుల్‌ను అలంకరిద్దాం

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:04 AM

డైనింగ్‌ రూమ్‌లో టేబుల్‌ ఏరియాని ప్రత్యేకంగా అలంకరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తూ అహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. ఆ వివరాలు..

డైనింగ్‌ టేబుల్‌ను అలంకరిద్దాం

  • పెండెంట్‌ లైట్లు.. డైనింగ్‌ రూమ్‌ శోభను పెంచుతాయి. విశాలమైన టేబుల్‌ ఉంటే దాని మధ్యలో లైట్లతో నిండిన షాండ్లియర్‌ను వేలాడదీయవచ్చు. గది ఇంటీరియర్స్‌ను అనుసరించి క్రిస్టల్‌ డిజైన్లను, ఇత్తడి ఫిక్చర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పొడవాటి టేబుల్‌ ఉన్నట్లయితే రెండు పెండెంట్‌ లైట్లను హ్యాంగ్‌ చేస్తే బాగుంటుంది. టేబుల్‌ మీద రంగురంగుల పూల గుత్తులతో కూడిన ఫ్లవర్‌ వేజ్‌ను పెడితే గ్రాండ్‌గా ఉంటుంది.

  • టేబుల్‌ ఏరియాలో పై కప్పుకు కొక్కేలు బిగించి చిన్న చిన్న మొక్కల కుండీలను వేలాడదీయవచ్చు. సువాసనభరితమైన పూల మొక్కలు, అలంకరణ మొక్కలను ఎంపిక చేసుకుంటే గదంతా తాజాగా

  • పచ్చదనం నిండుతుంది. గదిలోకి ప్రవేశించగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. చెక్క ఫర్నిచర్‌కు ఈ అలంకరణ చక్కగా నప్పుతుంది.

  • చేత్తో రూపొందించిన రట్టన్‌ లైట్స్‌, వెదురు పెండెంట్‌ లైట్స్‌.. గోడలపై అందమైన నీడలను ఏర్పరుస్తూ వింత అనుభూతినిస్తాయి. ఇవి బోహేమియన్‌, జాపాండి, కోస్టల్‌, మినిమలిస్ట్‌ ఇంటీరియర్స్‌కు చక్కగా నప్పుతాయి.

  • డైనింగ్‌ టేబుల్‌ పొడవునా వేలాడదీసిన లాంతర్లు గదికి వింటేజ్‌ లుక్‌నిస్తాయి. వివిధ లోహాలు, గాజు, అల్లికలతో రూపొందించిన లాంతర్లు... గదంతా మసక వెలుతురును ప్రసరిస్తూ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తాయి.

  • టేబుల్‌ మీద విభిన్న ఆకృతుల్లో ఉన్న క్లస్టర్డ్‌ పెండెంట్‌ లైట్లను అసమతుల్యంగా గుంపులా వేలాడదీస్తే రిచ్‌ లుక్‌ వస్తుంది. రంగు, ఫినిషింగ్‌, లైటింగ్‌ మాత్రం సమంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

  • లోహపు పొరలు వంపులు తిరిగినట్లుండే ఆకృతులు లేదా కళాత్మక సిల్హౌట్లతో నిండిన పెద్ద ఫిక్చర్‌ను టేబుల్‌పై వేలాడదీస్తే డైనింగ్‌ రూమ్‌ విభిన్నంగా ప్రకాశిస్తుంది.

Updated Date - Oct 29 , 2026 | 12:07 AM