వంటగది అందంగా..!
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:35 AM
ఉన్న కొద్దిపాటి స్థలాన్ని, అరలను తెలివిగా ఉపయోగించుకుంటూ వంటకి అనువుగా ఉండేలా, రిచ్ లుక్ వచ్చేలా వంటగదిని ఇలా సర్దుకోవాలి.
ఉన్న కొద్దిపాటి స్థలాన్ని, అరలను తెలివిగా ఉపయోగించుకుంటూ వంటకి అనువుగా ఉండేలా, రిచ్ లుక్ వచ్చేలా వంటగదిని ఇలా సర్దుకోవాలి.
వంటగది ప్లాట్‌ఫామ్‌ను డబ్బాలు, పాత్రలు, ఇతర సామాన్లతో నింపకూడదు. దాని మీద వంటకు కావాల్సిన వాటిని మాత్రమే ఉంచుకోవాలి. వంట పూర్తయిన తరువాత వాటిని గోడకు అమర్చిన అరల్లో చక్కగా సర్దేయాలి.
మిక్సీ, ఓవెన్, టోస్టర్ తదితర ఎలక్ట్రికల్ సామాన్లను అవసరమైనప్పుడు వాడుకుని ఆపైన అరల్లో పెట్టేయాలి. వాటిమీద దుమ్మ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
పాత్రలు, పళ్లాలు ఎక్కువగా ఉంటే వాటిని పొడిగా తుడిచి పెద్దదానిలో చిన్నది పట్టేలా అమర్చి చివరి అరలో సర్ది పెట్టాలి. రోజూ వాడే వాటిని ఒక పక్క, అప్పుడప్పుడు వాడేవాటిని మరో పక్క పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే ఖాళీ డబ్బాలు, వాటి మూతలను ఓ పక్కగా ఉంచుకోవాలి. అరల సైజుకు తగ్గట్టు స్టోరేజ్ బ్యాస్కెట్లను తెచ్చుకుని వాటిలో టీ, కాఫీ, మసాలా పొడుల ప్యాకెట్లతో పాటు వంటకు కావాల్సిన ఇతర దినుసుల ప్యాకెట్లను సర్ది పై అరల్లో ఉంచుకుంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.