Share News

దుస్తులు తాజాగా...

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:14 AM

ఖరీదైన దుస్తులను ఒకటి రెండుసార్లు వేసుకున్నా, అవి కొద్దిగా మాసినా వెంటనే డ్రైక్లీనింగ్‌కు ఇవ్వకుండా చిన్న చిట్కాలతో వాటిని తాజాగా మార్చేయవచ్చు. ఆ వివరాలు...

దుస్తులు తాజాగా...

ఖరీదైన దుస్తులను ఒకటి రెండుసార్లు వేసుకున్నా, అవి కొద్దిగా మాసినా వెంటనే డ్రైక్లీనింగ్‌కు ఇవ్వకుండా చిన్న చిట్కాలతో వాటిని తాజాగా మార్చేయవచ్చు. ఆ వివరాలు...

  • ఒకసారి వేసుకున్న డ్రెస్‌ను లోపలి భాగం బయటికి వచ్చేలా తిప్పి బాగా గాలి తగిలేలా ఆరేయాలి. దీనివల్ల డ్రెస్‌కు పట్టిన చెమట వాసన తొలగిపోతుంది. చెమట ఎక్కువగా పట్టే భాగాలపై కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లి స్పాంజ్‌తో తుడిచినా మంచి ఫలితం కనిపిస్తుంది. డ్రెస్‌ను రెండు చేతులతో పట్టుకుని గట్టిగా దులిపితే దానికంటిన దుమ్ము వదులుతుంది.

  • ఏవైనా చిన్నపాటి మరకలు ఏర్పడితే ఆ ప్రదేశం మేరకు మాత్రమే కొద్దిగా తడిపి షాంపూ లేదా లిక్విడ్‌ డిటర్జెంట్‌తో జాగ్రత్తగా శుభ్రం చేయాలి. మరకను గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే ఫ్యాబ్రిక్‌ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేసే ముందు ఆ ఫ్యాబ్రిక్‌ రంగు వెలుస్తుందో లేదో పరీక్షించాలి. రంగు వెలుస్తుంటే మాత్రం ఫ్యాబ్రిక్‌ను తడపకుండా కొద్దిగా వెనిగర్‌ను చిలకరించి మరకలను పోగొట్టవచ్చు.

  • మురికి ఎక్కువగా చేరే కాలర్‌, హ్యాండ్స్‌, లెగ్స్‌ భాగాలను కూడా సబ్బు లేదా షాంపూతో మెల్లగా రుద్ది ఆపైన కొద్దిపాటి నీటితో శుభ్రం చేయాలి. ఆపైన డ్రెస్‌ను హ్యాంగర్‌కు వేలాడదీసి గాలికి ఆరనివ్వాలి.

  • డ్రెస్‌ భాగాలను తేలికగా శుభ్రం చేసిన తరువాత వాటిని చేత్తో గట్టిగా పిండకూడదు. తడిసిన భాగాన్ని తువాలు మధ్యలో ఉంచి మెల్లగా ఒత్తితే తడి తగ్గి డ్రెస్‌ త్వరగా

    ఆరుతుంది.

Updated Date - Oct 03 , 2026 | 01:14 AM