Share News

కలర్‌ పోకుండా...

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:22 AM

ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్‌లు, చీరలు ఒక్క ఉతుక్కే రంగుమారిపోయి మెరుపు తగ్గితే బాధగా అనిపిస్తుంది. అలాకాకుండా పాటించాల్సిన చిట్కాలివే...

కలర్‌ పోకుండా...

ఎంతో ఇష్టపడి కొనుక్కున్న డ్రెస్‌లు, చీరలు ఒక్క ఉతుక్కే రంగుమారిపోయి మెరుపు తగ్గితే బాధగా అనిపిస్తుంది. అలాకాకుండా పాటించాల్సిన చిట్కాలివే...

  • బకెట్‌ నీళ్లలో మూడు చెంచాల రాళ్ల ఉప్పువేసి కరిగించాలి. అందులో కొత్త డ్రెస్‌ లేదా చీరను ముంచి కొద్దిసేపు నానబెడితే వాటి కలర్లు లాక్‌ అవుతాయి. ఆపైన మైల్డ్‌ షాంపూ లేదా డిటర్జెంట్‌ కలిపిన నీటితో ఉతికితే రంగులు పోకుండా దుస్తులు ఎప్పటికీ కొత్తవాటిలాగే ఉంటాయి.

  • కొత్త డ్రెస్‌పై ఏవైనా మరకలు పడితే వాటిపై కొద్దిగా బేకింగ్‌ సోడా చల్లి మెత్తటి స్పాంజ్‌తో రుద్దాలి. తరువాత బకెట్‌ నీటిలో అర కప్పు వైట్‌ వెనిగర్‌ను కలిపి అందులో డ్రెస్‌ను ముంచి ఉతికితే మొండి మరకలు, మురికి, జిడ్డు సులువుగా వదులుతాయి.

  • వాషింగ్‌ మెషిన్లో వేసేటట్లయితే వాటిని రివర్స్‌ చేయడం మంచిది. మెషిన్లో నిండుగా బట్టలు వేయకుండా సెన్సిటివ్‌ వాష్‌ సైకిల్‌ను సెలెక్ట్‌ చేయాలి.

  • సున్నితమైన చీరలను జీన్స్‌, మందపాటి జాకెట్లతో కలిపి మెషిన్లో వేయకూడదు.

  • ఉతికిన డ్రెస్‌లను నేరుగా ఎండలో ఆరవేయకూడదు. ఎండ వల్ల వాటి రంగులు వెలిసిపోతాయి. కాబట్టి వాటి లోపలి భాగం పైకి వచ్చేలా తిరగలి తీసి నీడలో గాలి తగిలేలా ఆరేయడం మంచిది. ముదురు రంగుచీరలు, బ్లౌజ్‌లకు ఎండతగలకుండా చూసుకోవాలి.

  • కొత్త దుస్తులను వేడి నీటితో ఉతకకూడదు. రంగురంగుల డ్రెస్‌లకు బ్లీచ్‌తో కూడిన డిటర్జెంట్లను వాడకూడదు.

  • పట్టు చీరలు, సున్నితమైన కాటన్‌ డ్రెస్‌లను బేబీ షాంపూ, లిక్విడ్‌ డిటర్జెంట్లతో మాత్రమే ఉతకాలి.

Updated Date - Oct 31 , 2026 | 12:22 AM