Share News

గిన్నెలు తోమేటప్పుడు...

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:55 AM

వంటగదిలో సింక్‌ ముందు నిలబడి గిన్నెలు తోమేటప్పుడు దుస్తులపై డిటర్జెంట్‌ చుక్కలు పడడం, నీళ్లు చిందడం సాధారణం. అలాకాకుండా పాటించాల్సిన చిన్న చిట్కాలివే...

గిన్నెలు తోమేటప్పుడు...

వంటగదిలో సింక్‌ ముందు నిలబడి గిన్నెలు తోమేటప్పుడు దుస్తులపై డిటర్జెంట్‌ చుక్కలు పడడం, నీళ్లు చిందడం సాధారణం. అలాకాకుండా పాటించాల్సిన చిన్న చిట్కాలివే...

  • సింక్‌కు ఆనుకుని కాకుండా కొద్దిగా దూరంగా నిలబడి గిన్నెలు కడిగితే డ్రెస్‌పై నీళ్లు, డిటర్జెంట్‌ చిందవు. పెద్ద పాత్రలు, కంచాలు, కడాయి లాంటివాటిని తోమేటప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

  • సింక్‌లో పంపును ఫుల్‌ స్పీడ్‌నకు తిప్పి పాత్రలు కడుగుతుంటే ఆ నీళ్లు చింది మీద పడతాయి. కాబట్టి పంపును అవసరం మేరకు తక్కువ ఫ్లోలో తిప్పుకుంటే సమస్య తీరుతుంది. నీళ్లు కూడా ఎక్కువగా వృథా కావు. పంపునకు స్ర్పే నాజిల్‌ను అమర్చుకున్నట్లయితే దాని ప్రెజర్‌ను కూడా తక్కువలో పెట్టి వినియోగించడం మంచిది.

  • గిన్నెలు, కంచాలను సింక్‌ లోపల ఉంచి మెల్లగా తోమి పంపు నీటితో నెమ్మదిగా కడిగితే డ్రెస్‌ తడవదు. చుట్టూ నీళ్లు చిందవు.

  • ఎన్ని జాగ్రత్తలు వహించినప్పటికీ దుస్తులు తడుస్తుంటే మాత్రం ప్లాస్టిక్‌ లేదా వినైల్‌ కోటింగ్‌ ఉన్న యాప్రాన్‌ను ధరించాలి. గిన్నెలే కాదు... పండ్లు, కూరగాయలు కడిగేటప్పుడు; స్టవ్‌, వంటగది గట్టులను శుభ్రం చేసేటప్పుడు కూడా ఈ యాప్రాన్‌ పనికొస్తుంది.

  • సింక్‌ అంచుల వద్ద పలుచని న్యాప్‌కిన్లను ఉంచితే అవి నీటి చుక్కలను పీల్చుకుని మంచి ఫలితాన్నిస్తాయి.

  • గిన్నెలు కడిగిన తరువాత చేతులను తుడుచుకోవడానికి హ్యాండ్‌ టవల్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. అంతే తప్ప చేతులను డ్రెస్‌తో తుడుచుకోకూడదు.

Updated Date - Oct 10 , 2026 | 12:55 AM