ప్రీ కండిషనింగ్ ఎలా?
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:23 AM
తలస్నానానికి ముందు శిరోజాలను ఎలా ప్రీ కండిషనింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం...
తలస్నానానికి ముందు శిరోజాలను ఎలా ప్రీ కండిషనింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం...
ముందుగా శిరోజాలను చిక్కులు లేకుండా దువ్వాలి. తరువాత కొద్దిగా కొబ్బరి నూనె/ బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను మాడు మీద కాకుండా శిరోజాలకు పట్టించాలి. కండిషనర్‌ను కూడా వాడవచ్చు. ఆపైన అరగంటసేపు శిరోజాలను అలాగే వదిలేయాలి. షవర్ క్యాప్ పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శిరోజాల పొరల్లోకి తేమ ఇంకుతుంది. తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. శిరోజాలను శుభ్రం చేయడానికి మైల్డ్ షాంపూను మాత్రమే వాడాలి.
కప్పు పెరుగులో కోడిగుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు ప్యాక్‌లా వేసి వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో మెల్లగా దువ్వాలి. ఆపైన హెయిర్ క్యాప్ పెట్టి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శిరోజాలకు డీప్ కండిషనింగ్ ఫలితం వస్తుంది. ప్రీ కండిషనింగ్ చేయడం వల్ల శిరోజాల చుట్టూ రక్షణ పొర ఏర్పడుతుంది. దీంతో షాంపూలోని రసాయనాల వల్ల వాటికి ఎలాంటి హాని కలుగదు. సరైన పోషణ లభించడంతో అవి పొడిబారకుండా తేమతో నిండి మృదువుగా ఉంటాయి. తలస్నానం తరువాత చిక్కులు పడవు. వాటి చివర్లు చిట్లవు. అంతేకాదు నల్లగా ఒత్తుగా పట్టులా మెరుస్తుంటాయి కూడా.