Post Surgery Issue: ఈ వింత పరిస్థితి ఎందుకు?
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:53 AM
డాక్టర్! నాకు సర్జరీ ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు తొలగించారు. ఆ తర్వాత మూడు నెలలపాటు ‘యూరిమాక్స్’ అనే మందులు వాడమన్నారు. అయితే సెక్స్‌లో పాల్గొన్నప్పుడు...
డాక్టర్! నాకు సర్జరీ ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు తొలగించారు. ఆ తర్వాత మూడు నెలలపాటు ‘యూరిమాక్స్’ అనే మందులు వాడమన్నారు. అయితే సెక్స్‌లో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి కలుగుతున్నా, వీర్యస్కలనం జరగడం లేదు. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న మాకు ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్య సర్జరీ ఫలితమా?
- ఓ సోదరుడు, ఖమ్మం.
మీకున్న సమస్య ‘రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్’! స్కలనం ద్వారా వెలుపలికి రావలసిన వీర్యం మూత్రాశయం లోకి చేరుకుని, మూత్రవిసర్జన ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితికి కారణం సర్జరీ తదనంతరం వాడుతున్న యూరిమాక్స్ మందుల దుష్ప్రభావం కావచ్చు. అలాగే మధుమేహం ఎక్కువగా ఉన్నా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. కాబట్టి వైద్యులను సంప్రతించి, ప్రత్యామ్నాయ మందులు వాడడం లేదా, కొంతకాలం పాటు మందుల ఆపడం చేయండి. ఆ తర్వాత వీర్యస్కలనం యధాతధంగా జరుగుతూ ఉంటే, భయపడవలసిన అవసరం లేదు. మధుమేహం నిర్ధారణ కోసం షుగర్ టెస్ట్ కూడా చేయించుకోండి.
డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్,ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్,జూబ్లీహిల్స్, హైదరాబాద్.