Share News

పాత దుప్పట్లతో ఇలా...

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:47 AM

మనం వాడకుండా పక్కన పెట్టిన పాత దుప్పట్లను తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం రండి...

పాత దుప్పట్లతో ఇలా...

మనం వాడకుండా పక్కన పెట్టిన పాత దుప్పట్లను తెలివిగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం రండి...

  • మనం ఏదైనా ఊరికి వెళ్లేటప్పుడు లేదా ఇంట్లో ఏదైన రిపేర్‌ వర్క్‌ చేయిస్తున్నప్పుడు సోఫా, డైనింగ్‌ టేబుల్‌, కుర్చీల మీద దుమ్ము, ధూళి పడకుండా పాత దుప్పట్లను కప్పవచ్చు.

  • కొంతమంది ఇళ్లలో కుక్కలు లేదా పిల్లుల్ని పెంచుకుంటూ ఉంటారు. వాటికోసం పాత దుప్పట్లతో చక్కని సాఫ్ట్‌ బెడ్‌ తయారు చేయవచ్చు. దుప్పట్లను కత్తిరించి కుషన్స్‌గా కూడా కుట్టవచ్చు. ఇవన్నీ పెంపుడు జంతువులకు అనువుగా ఉపయోగకరంగా ఉంటాయి.

  • పాత దుప్పట్లు త్వరగా తడిని పీల్చుకుంటాయి. కాబట్టి వాటిని చదరాలుగా కత్తిరించి అంచులు కుట్టి డోర్‌ మ్యాట్‌లు, డస్టింగ్‌ క్లాత్‌లుగా వాడవచ్చు. నేల తుడవడానికీ వాడుకోవచ్చు.

  • పలుచని దుప్పట్లతో గాజు సామాన్లు, కిటికీలు, డైనింగ్‌ టేబుల్‌, ఫ్యాన్‌, ఏసీ, టీవీ తదితరాలను శుభ్రంగా తుడవచ్చు.

  • పెద్ద సైజులో ఉండే కార్డ్‌ బోర్డ్‌ బాక్సులకు ఫెవీకాల్‌ సహాయంతో పాత దుప్పట్లను అతికించి స్టయిలిష్‌ స్టోరేజ్‌ బాక్సులుగా మార్చవచ్చు. వీటిలో పిల్లల పుస్తకాలు, బొమ్మలు, బట్టలు తదితరాలను చక్కగా సర్దుకోవచ్చు. వీటివల్ల ఇంటికి డెకరేటివ్‌ లుక్‌ కూడా వస్తుంది.

  • కుట్టుపని తెలిసిన వారైతే పాత దుప్పట్లతో షాపింగ్‌ బ్యాగ్‌లు, డోర్‌ కర్టెన్లు, పిల్లో కవర్లు, టేబుల్‌ క్లాత్‌లు.. ఇలా ఎన్నో చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

Updated Date - Apr 19 , 2026 | 01:47 AM