Share News

టీ డికాక్షన్‌తో నల్లగా...

ABN , Publish Date - Nov 04 , 2026 | 12:51 AM

పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం తదితర కారణాల వల్ల ప్రస్తుతం అందరికీ వయసుతో సంబంధం లేకుండా శిరోజాలు నెరుస్తున్నాయి. ఒకట్రెండు తెల్ల వెంట్రుకలు కనిపించగానే రసాయనభరితమైన డై వాడకుండా ఇంటి చిట్కాలు పాటించి కొంతవరకు కవర్‌ చేసుకోవచ్చు . అలాంటిదే టీ డికాక్షన్‌ ట్రిక్‌. శిరోజాలకు దీన్ని అప్లయ్‌ చేయడమనేది పాతకాలం నుంచి వస్తున్నదే. ఆ వివరాలు...

టీ డికాక్షన్‌తో నల్లగా...

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి రెండు కప్పుల నీటిని పోసి బాగా మరిగించాలి. తరువాత అందులో మూడు చెంచాల టీ పొడిని వేయాలి. చిన్న మంటమీద పావుగంటసేపు ఉడికించాలి. నీళ్లు ముదురు రంగులోకి రాగానే స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చి మరోగిన్నెలోకి వడబోయాలి.

  • ముందుగా తలస్నానం చేయాలి. శిరోజాలు తడిగా ఉన్నప్పుడే టీ డికాక్షన్‌ను కుదుళ్ల నుంచి శిరోజాల చివర్ల వరకు బాగా పట్టించాలి. తెల్ల వెంట్రుకలు ఉన్నచోట కాస్త ఎక్కువగా అప్లయ్‌ చేసి కనీసం అరగంటసేపు ఆరనివ్వాలి. ఆపైన శిరోజాలను మంచినీటితో శుభ్రం చేసుకుని కండిషనర్‌ అప్లయ్‌ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • టీ డికాక్షన్‌ వాడడం వల్ల శిరోజాలు శాశ్వతంగా నలుపురంగులోకి మారవు. టీ డికాక్షన్‌లో సహజంగా ఉండే టానిన్స్‌, థియోప్లావిన్స్‌, థియారుబిగిన్స్‌ అనే పిగ్మెంట్లు శిరోజాలపై లేయర్లా ఏర్పటి నల్లగా మెరిసేలా చేస్తాయి. దీనివల్ల నెరిసిన శిరోజాలు కూడా నల్లవాటిలో సులువుగా కలిసిపోతాయి.

Updated Date - Nov 04 , 2026 | 12:51 AM