Share News

మునగ పూతరాలుతోందా..!

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:25 AM

ఇంటి పరిసరాల్లో, మిద్దె తోటల్లో పెంచుతున్న మునగ చెట్టు ఏపుగా పెరిగినప్పటికీ పూత రాలిపోతుంటుంది. అలాకాకుండా పూత నిలిచి చెట్టు నిండా మునగ కాయలు రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం...

మునగ పూతరాలుతోందా..!

ఇంటి పరిసరాల్లో, మిద్దె తోటల్లో పెంచుతున్న మునగ చెట్టు ఏపుగా పెరిగినప్పటికీ పూత రాలిపోతుంటుంది. అలాకాకుండా పూత నిలిచి చెట్టు నిండా మునగ కాయలు రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం...

  • మునగ చెట్టుకు పూత కనిపిస్తున్నప్పుడు ఎక్కువగా నీటిని అందించకూడదు. అలా అందిస్తే ఆకులు, కొమ్మలు విపరీతంగా పెరిగి పూత రాలిపోతుంది. మట్టి బాగా పొడిబారినప్పుడు మాత్రమే తగు మాత్రంలో నీటిని అందిస్తే పూత నిలబడి కాయలు బాగా కాస్తాయి.

  • అయిదు లీటర్ల నీటిలో లీటరు పుల్లటి మజ్జిగ, అరచెంచా ఇంగువ పొడి వేసి బాగా కలిపి సాయంత్రంపూట కొమ్మలపై పిచికారీ చేయాలి. చెట్టు పూత దశలో ఉన్నప్పుడు ఇలాచేయడం వల్ల మజ్జిగలోని లాక్టికామ్లం తెగుళ్లను, హానికారక క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది. ఇంగువ వాసనకు తేనెటీగలు ఆకర్షితమై పరాగసంపర్కానికి తోడ్పడతాయి. దీంతో పూత రాలడం ఆగిపోతుంది.

  • చెట్టుకు అడుగు దూరంలో మట్టిని తవ్వి రెండు దోసిళ్ల బూడిదను వేసి బాగా కలిపితే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • లీటరు నీటిలో చిటికెడు సున్నాన్ని కలిపి చెట్టుకు అందిస్తే పూత రాలడం తగ్గుతుంది.

  • అయిదు లేదా ఆరడుగులు పెరగగానే చెట్టు పై భాగాన్ని కత్తిరిస్తే పక్కల నుంచి కొమ్మలు పెరగడంతోపాటు ఎక్కువగా పూత వచ్చి నిలుస్తుంది.

  • పశువుల ఎరువుకు కొద్దిగా వేప పిండి కలిపి చెట్టు చుట్టూ పాదు తీసి మట్టిలో కలిపితే పూత రాలడం ఆగిపోతుంది.

Updated Date - Sep 30 , 2026 | 04:25 AM