Share News

గాట్లు దాచాలంటే...

ABN , Publish Date - Oct 24 , 2026 | 02:32 AM

గాయాల తాలూకు మచ్చలున్న చర్మం మీద మేకప్‌ కోసం ప్రత్యేక మెలకువలు పాటించాలి. ఆ గాట్లను దాచడం కోసం అవసరానికి మించిన మేకప్‌ అద్దుకోకుండా, వాటిని చర్మంలో కలిసిపోయే కిటుకులు పాటించాలి. ఎలాగంటే...

గాట్లు దాచాలంటే...

చర్మాన్ని సిద్ధం చేసి...

సాధారణంగా స్కార్‌ టిష్యూ పొడిగా ఉంటుంది. దాంతో దాని మీద మేకప్‌ నిలవకుండా అంచుల వైపు జారిపోతుంది. కాబట్టి మేక్‌పకు ముందు గాటు మీద మాయిశ్చరైజర్‌ అప్లై చేయాలి. అలాగే గుంట పడిన గాటు మీద సిలికాన్‌ బేస్‌డ్‌ పోర్‌ ఫిల్లింగ్‌ లేదా టెక్స్‌చర్‌ రిఫైనింగ్‌ ప్రైమర్‌ను అప్లై చేసి, ఆ ప్రదేశాన్ని సమం చేయాలి. గాటు ఉబ్బెత్తుగా ఉంటే, స్మూత్‌ హైడ్రేటింగ్‌ ప్రైమర్‌ ఉపయోగించాలి.

కలర్‌ కరెక్షన్‌

గాటు రంగును కచ్చితంగా విశ్లేషించి, దాని రంగుకు తగిన స్కిన్‌ టోన్డ్‌ ఉత్పత్తులనే ఎంచుకోవాలి.ఎరుపు, గులాబీ రంగు గాట్లకు ఆకుపచ్చ కలర్‌ కరెక్టర్‌ ఉపయోగించాలి.గోధుమ రంగు గాట్లకు పీచ్‌ లేదా ఆరెంజ్‌ కలర్‌ కరెక్టర్‌ వాడుకోవాలి. సన్నని బ్రష్‌తో కొద్దిగా కరెక్టర్‌ తీసుకుని గాటు మీద అప్లై చేసుకోవాలి. అవసరానికి మించి కరెక్టర్‌ను అప్లై చేస్తే ఆ ప్రదేశం ఉబ్బెత్తుగా మారి అందవిహీనంగా తయారవుతుంది. కాబట్టి వీలైనంత పలుచగా అప్లై చేసుకోవాలి.

ఫౌండేషన్‌- కన్‌సీలర్‌

స్టిప్లింగ్‌ బ్రష్‌ లేదా తడిపి పిండిన స్పాంజ్‌తో ఫౌండేషన్‌ను అప్లై చేసుకోవాలి. బ్రష్‌ లేదా స్పాంజిని చర్మం మీద లాగడంవల్ల ఫౌండేషన్‌ చక్కని మెరుపును సంతరించుకుంటుంది. చర్మంలో కలిసిపోయే లిక్విడ్‌ లేదా క్రీమీ కన్‌సీలర్‌ను నేరుగా గాటు మీదే అద్దుకోవాలి. తర్వాత అంచులు కలిసిపోయేలా బ్లెండ్‌ చేసుకోవాలి. మ్యాట్‌ ఫార్ములాలు పొడిబారిన గాటును మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి అలాంటి ఫార్ములాల జోలికి పోకుండా సహజసిద్ధ, సాఫ్ట్‌ శాటిన్‌ ఫినిష్‌ మీదే దృష్టి పెట్టాలి.

Updated Date - Oct 24 , 2026 | 02:49 AM