అరవైల్లో ఇరవైలా
ABN , Publish Date - Oct 31 , 2026 | 12:08 AM
పైబడే వయసులో ముఖం మీద ముడతలు, గీతలు సహజం. చర్మం కూడా పటుత్వం కోల్పోయి సాగిపోతుంది. కాబట్టి పెద్ద వయసులో వేసుకునే మేకప్‌లో కొన్ని మెలకువలు పాటించాలి. అవేంటంటే....
చర్మాన్ని సిద్ధం చేసి...
మాయిశ్చరైజర్: ముఖం మీద గీతలన్నీ చర్మంలో కలిసిపోయి. ఆ గీతల్లో మేకప్ ఇరుక్కుపోకుండా ఉండడం కోసం, రిచ్ మాయిశ్చరైజర్ లేదా హైడ్రేటింగ్ సీరమ్‌ను చర్మానికి అప్లై చేయాలి.
రేడియంట్ ప్రైమర్: హైడ్రేటింగ్, ఇల్యుమినేటింగ్ ప్రైమర్‌కు హైల్యురోనిక్ యాసిడ్ లేదా గ్లిజరిన్ కలిపి, ముఖానికి అప్లై చేసి, మెరుపులీనే బేస్ తయారుచేసుకోవాలి.
ఫౌండేషన్స్: హెవీ లేదా మ్యాట్ పౌడర్లను వాడుకోకూడదు. ఇవి ముఖాన్ని పొడిబారుస్తాయి. బదులుగా లైట్ వెయిట్, క్రీమీ, లేదా షీర్ గ్లో టింట్స్ ఉపయోగించాలి.
స్కిన్ ప్రిపరేషన్: కన్‌సీలర్‌ను ఐ బ్యాగ్స్ దిగువన అద్దకుండా, కళ్లకు ఇరువైపులా క్రీమీ కన్‌సీలర్ అప్లై చేయాలి.
కంటూరింగ్ ఇలా...
బ్లష్: క్రీమ్ లేదా లిక్విడ్ బ్లష్ (పీచ్, రోజ్, లేదా మావ్) చెక్కిళ్ల ఎముకల మీద అప్లై చేసి, కణతల వైపు బ్లెండ్ చేయాలి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.
బ్రాంజ్: కఠినమైన కాంటూర్ లైన్స్‌కు బదులుగా మ్యాట్ బ్రాంజర్‌ను నుదురు, చెక్కిళ్లు, దవడ... ఇలా ముఖంలో ఎత్తుగా కనిపించే ప్రదేశాల మీద అప్లై చేసుకోవాలి.
హైలైటర్స్: పౌడర్ ఆధారిత హైలైటర్స్‌తో
అందరి దృష్టి చర్మపు టెక్స్‌చర్ మీదకు మళ్లుతుంది. కాబట్టి క్రీమీ హైలైటర్‌ను ఎంచుకోవాలి.