Share News

జీలకర్ర.. జీర్ణక్రియకు మహౌషధం

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:45 AM

‘భోజన కుతూహలం’ గ్రంథం జీలకర్ర గురించి చెప్పిన శ్లోకం ఇది. జీలకర్ర కారంగా ఉంటుంది. రుచినిస్తుంది. జఠరాగ్ని పెంచి జీర్ణశక్తిని కలిగిస్తుంది. తిన్నది సక్రమంగా అరిగేలా చేస్తుంది. మంచి పరిమళాన్నిస్తుంది.

జీలకర్ర.. జీర్ణక్రియకు మహౌషధం

‘భోజన కుతూహలం’ గ్రంథం జీలకర్ర గురించి చెప్పిన శ్లోకం ఇది. జీలకర్ర కారంగా ఉంటుంది. రుచినిస్తుంది. జఠరాగ్ని పెంచి జీర్ణశక్తిని కలిగిస్తుంది. తిన్నది సక్రమంగా అరిగేలా చేస్తుంది. మంచి పరిమళాన్నిస్తుంది. కొవ్వును కరిగించటానికి తోడ్పడుతుంది. కఫాన్ని, వాంతి, వికారాలను తగ్గిస్తుంది. కొద్దిగా వేడి చేస్తుంది. అతిసారం, కలరా లాంటి విరేచనాల వ్యాధుల్లో, పేగుల్లో వచ్చే రోగాలపైన పని చేస్తుంది. కడుపులో నొప్పిని నివారిస్తుంది. ఉబ్బరాన్ని, గ్యాసుని తగ్గిస్తుంది. నులిపురుగుల్ని పోగొడుతుంది. దంత వ్యాధుల మీద కూడా దీని ప్రభావం ఉంది.

  • ధనియాలు, జీలకర్ర, శొంఠి... ఈ మూడింటినీ విడివిడిగా వేగించి తగినంత ఉప్పు కలిపి, మెత్తగా దంచిన పొడిని రోజూ తీసుకునేవారికి జీర్ణకోశ సమస్యలు, వాతవ్యాధులు దరిచేరవు.

  • వేగించిన జీలకర్రను పావు చెంచా మోతాదులో తీసుకుని నలిపి, గ్లాసు మజ్జిగలో వేసుకుని భోజనం చివర్లో తాగితే భుక్తాయాసం కలగకుండా ఉంటుంది. ఆహారం తేలికగా అరుగుతుంది.

  • జీలకర్రతో టీ కాచుకుని రోజూ రెండు పూటలా తాగుతుంటే పైన చెప్పిన ప్రయోజనాలన్నీ కలుగుతాయి. నీరసం, దాహం తగ్గించడానికి, గర్భిణులకు వచ్చే ఉదయపు వికారం తగ్గించడానికీ ఉపయోగపడుతుంది.

  • జీలకర్ర, బెల్లం కలిపి దంచి, ఉండలు కట్టుకుని స్త్రీలు నెలసరికి ముందు రోజూ ఒకటి రెండు ఉండలు తింటూ ఉంటే నెలసరి సమస్యలు తగ్గుతాయి.


  • జీలకర్ర, పటికబెల్లం కలిపి నోట్లో వేసుకుని నమిలి రసం మింగుతుంటే పొడి దగ్గు, గొంతు గరగర, గొంతునొప్పి తగ్గుతాయి.

  • పుల్లని మామిడికాయలు, పులుపు పదార్థాలు అతిగా తిన్నప్పుడు కలిగే పైత్య వికారాన్ని తగ్గించటానికి జీలకర్ర, బ్లాక్‌ సాల్ట్‌ కలిపి దంచిన పొడిని ఒక చెంచాడు తీసుకుని, గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే వికారం తగ్గుతుంది.

  • జీలకర్ర పొడి, నిమ్మ రసం, పంచదార, తినే షోడాఉప్పు నీళ్లలో లేదా మజ్జిగలో కలిపి తాగితే వడదెబ్బ తగ్గుతుంది. వేడి, పైత్యం తగ్గుతాయి. జీలకర్రలో సువాసనకు కారణమయ్యే ‘క్యూమినాల్డిహైడ్‌’తో పాటు లిమోనిన్‌ వంటి సువాసన నూనె పదార్థాలు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. వీటిలో కొన్ని పదార్థాలకు సూక్ష్మజీవులను అడ్డుకునే, వాపును తగ్గించే, కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడే లక్షణాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. జీలకర్రని పైపైన వేగించి వాడుకోవాలని ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి.

  • ‘జీరక’ అనే సంస్కృతం మాట తెలుగులో జీలకర్ర అయ్యింది. జీరకారిష్ట, యోగరాజ గుగ్గులు, ధాత్రీ రసాయనం, హింగ్వాష్టక చూర్ణం లాంటి ఔషధాలు జీలకర్రతో తయారవుతాయి. మనం జీలకర్ర గింజలని పిలిచేవి ఆ మొక్క ఎండిన పండ్లు. తాలింపులో పావు చెంచా జీలకర్ర వేసినా అది పరిమళానికే కాదు అరుగుదలకూ తోడ్పడుతుంది.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Nov 07 , 2026 | 12:47 AM