Share News

ఆ నీటిని వృథా చేయొద్దు

ABN , Publish Date - Oct 24 , 2026 | 02:35 AM

వాటర్‌ ప్యూరిఫయర్‌ నుంచి వ్యర్థాలతో కూడిన నీరు విడుదలవుతూ ఉంటుంది. ఈ నీటిని వృథా చేయకుండా ఎలా వినియోగించుకోవచ్చో చూద్దాం...

ఆ నీటిని వృథా చేయొద్దు

రోజూ ఇల్లు తుడవడానికి ఈ నీటిని ఉపయోగించవచ్చు. ఈ నీటిలో లవణాలు, ఖనిజాలు అధికంగా ఉంటాయి కాబట్టి మార్బుల్‌ లేదా గ్రానేట్‌ ఫ్లోర్‌పై తెల్లటి మరకలు ఏర్పడవచ్చు. వీటిని నివారించేందుకు కొద్దిగా మంచినీటిని కలిపి వాడడం మంచిది. ఈ వ్యర్థ జలంలో ఫ్లోర్‌ క్లీనింగ్‌ లిక్విడ్‌ లేదా ఫినాయిల్‌ కలిపి ఇల్లు తుడిస్తే ఏ సమస్యా ఉండదు.

  • ఈ నీటిని నిల్వ చేసుకుని దానితో ఇంటి పరిసరాలను అలాగే కారు, బైక్‌, సైకిల్‌ తదితర వాహనాలను శుభ్రం చేసుకోవచ్చు.

  • ఈ నీటితో వంట పాత్రలను కడగవచ్చు. అందులో కొద్దిగా లిక్విడ్‌ డిటర్జెంట్‌ కలిపి స్టవ్‌ను క్లీన్‌ చేసుకోవచ్చు.

  • బాత్‌రూమ్‌ను శుభ్రం చేయడానికి, టాయిలెట్‌ ఫ్లషింగ్‌కు ఈ నీటిని వాడవచ్చు.

  • కుండీల్లో, ఇంటి చుట్టూ పెంచే మొక్కలకు ఈ నీటిని అందించవచ్చు. కలబంద, మందారం, గన్నేరు మొక్కలకు ఈ నీరు అనుకూలం. వేసవి కాలంలో అయితే ఎయిర్‌ కూలర్లలో నింపవచ్చు.

  • తోటపని కోసం ఉపయోగించే పనిముట్లను ఈ నీటితో కడగవచ్చు. మేడ మెట్లను శుభ్రం చేయవచ్చు. మిద్దె తోట పెంచేవారు అన్ని దిక్కుల్లో కొద్ది కొద్దిగా ఈ నీటిని చల్లితే మొక్కలకు క్రిమి కీటకాలు చేరవు. ఇంట్లో ప్రతి గది మూలల్లో ఈ నీటిని చల్లితే దోమలు, ఈగలు, చీమలు రావు. ఈ నీటిలో ఉండే లవణాలన్నీ కలిసి సహజ కీటక నివారిణిగా పనిచేస్తాయి.

  • ఎక్కువగా మురికి చేరిన దుప్పట్లు, సోఫా కవర్లు, విండో కర్టెన్లు, డోర్‌మ్యాట్లను ఈ నీటిలో నానబెట్టి మొదటి విడత వాషింగ్‌ను పూర్తిచేయవచ్చు.

Updated Date - Oct 24 , 2026 | 02:51 AM