మంచి అలవాట్లకు ఇప్పుడే బీజం
ABN , Publish Date - Feb 14 , 2026 | 01:36 AM
సరైన తిండి, సమయానికి నిద్ర పోవడం, చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వంటి అలవాట్లు బాల్యం నుంచే నేర్పించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఇవి చాలా దోహదం చేస్తాయి.
సరైన తిండి, సమయానికి నిద్ర పోవడం, చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వంటి అలవాట్లు బాల్యం నుంచే నేర్పించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఇవి చాలా దోహదం చేస్తాయి.
స్ర్కీన్‌టైంపై నిఘా...
ఈ కాలంలో ఫోన్‌కు అలవాటుపడని పిల్లలు ఉండరు. సాంకేతికతను ఎలా ఉపయోగించాలో వారికి వివరంగా తెలపాలి. చదువుకు సంబంధించిన యాప్స్, గేమ్స్ ఇప్పుడు బోలెడు అందుబాటులో ఉన్నాయి. వాటిని పరిచయం చేసి ఏ వెబ్‌సైట్స్ కావాలో, ఏవి వద్దో తల్లిదండ్రులు నిర్ణయించి ఫోన్‌లో తగిన సెట్టింగ్స్ చేయాలి.
స్వతంత్రంగా ఆలోచించనివ్వండి...
పిల్లలకు కొన్నికొన్ని విషయాల్లో స్వేచ్ఛను ఇవ్వాలి. అలా ఇవ్వడంవల్ల వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీనిద్వారా ఆలోచనాశక్తి పెరిగి, మానసిక వికాసం పొందుతారు.
భాగస్వామ్యం అవసరం...
విద్యావంతులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం పిల్లల పెంపకంలో కీలకమైనది. వీరి సమన్వయంతో విద్యాపరమైన, సామాజికపరమైన సలహాలు, సూచనలు పిల్లలకు ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలు నిర్వహించే పేరెంట్స్ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరవ్వాలి. తమ పిల్లల చదువు, భవితపై ఉపాధ్యాయులతో చర్చించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి.
బంధం బలంగా...
తల్లిదండ్రులు పిల్లలతో బలమైన బంధాలు ఏర్పరచుకోవాలి. వారిని ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ ప్రతి అవసరంలో తోడుగా ఉంటే తల్లిదండ్రుల పట్ల నమ్మకం కలుగుతుంది. ఇది ఇరువురి మధ్య బంధానికి గట్టి పునాది వేస్తుంది. వారితో కలిసి ఆడడం, కొత్త ప్రదేశాలను చూపించడం ద్వారా వారిలో మానసిక పరిపక్వత పెరుగుతుంది.