బఠాణీలు తిందాం..!
ABN , Publish Date - Oct 28 , 2026 | 12:39 AM
బఠాణీలను కొద్దిగా వేయించుకుని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
బఠాణీలను కొద్దిగా వేయించుకుని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించడంతోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
రోజూ గుప్పెడు బఠాణీలను తింటే చాలు.. శరీరానికి అవసరమైన పీచు, ప్రొటీన్లు లభిస్తాయి. ఇవి కండరాల నిర్మాణానికి తోడ్పడతాయి. కడుపు నిండిన భావన కలిగి అతిగా తినాలనే కోరిక తగ్గుతుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో బఠాణీలు తినడం వల్ల వాటిలోని ఐరన్, ఫోలేట్లు కలిసి రక్తంలో హెమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. దీంతో అలసట, నీరసం, ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుంది.
బఠాణీల్లో ఉండే జింక్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, పాస్ఫరస్ తదితర ఖనిజాలు; ఎ, బి, సి, కె విటమిన్లు.. ఎముకల దృఢత్వానికి, హార్మోన్ల సమతుల్యతకూ ఉపకరిస్తాయి.
వేయించిన బఠానీలను స్నాక్స్‌లా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తీరుతుంది.
బఠాణీల్లో చెడు కొలెస్ట్రాల్ ఉండదు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.