రక్తపోటును తగ్గించేవి ఇవే
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:20 AM
అధిక రక్తపోటును నియంత్రించేందుకు తోడ్పడే పోషకాహారం వివరాలు...
అధిక రక్తపోటును నియంత్రించేందుకు తోడ్పడే పోషకాహారం వివరాలు...
ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. పొటాషియం, మెగ్నీషియం, పీచు అధికంగా ఉండే వాటిని భోజనంలో చేర్చుకోవాలి.
తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోజూ తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతికూరతోపాటు క్యారెట్, టమాటా, బీరకాయ, సొరకాయ, బెండకాయలతో తయారుచేసిన వంటకాలను తరచూ తింటుండాలి. వంటకాల్లో ఉప్పు, నూనెలను తగు మాత్రమే వినియోగించాలి.
అరటి, నారింజ, బొప్పాయి, జామ, యాపిల్ పండ్లను రోజూ తినాలి. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పీచు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.
పెసలు, కందిపప్పు, శనగలు, రాజ్మా, అలసందలు లాంటి పప్పు ధాన్యాలను మార్చి మార్చి భోజనంలో చేర్చుకోవాలి. వీటిద్వారా లభించే ప్రోటీన్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.
అన్న తినడం పూర్తిగా మానేయకూడదు. మితంగా తినవచ్చు. ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమలు, రాగులు, సజ్జలు, జొన్నలు తదితరాలను అలవాటు చేసుకోవడం మంచిది.
పరిమిత మోతాదులో బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్‌ను తీసుకోవచ్చు. వీటిని నానబెట్టి తినడం ఉత్తమం.