Share News

ట్రిప్‌కి వెళుతున్నారా

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:30 AM

పిల్లలు, పెద్దలు కలిసి ట్రిప్‌కి వెళ్లేటప్పుడు ఏమేమి వెంట తీసుకెళ్లాలో చూద్దాం...

ట్రిప్‌కి వెళుతున్నారా

పిల్లలు, పెద్దలు కలిసి ట్రిప్‌కి వెళ్లేటప్పుడు ఏమేమి వెంట తీసుకెళ్లాలో చూద్దాం...

  • సొంత వెహికిల్‌లో వెళుతున్నట్లయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌ పత్రాలు, వెహికిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తదితరాలు వెంట ఉంచుకోవాలి. అదే బస్సు, రైలు, విమాన ప్రయాణాలైతే రిజర్వేషన్‌ టికెట్లు, ఆధార్‌ కార్డులు లేదా ఇతర గుర్తింపు పత్రాలను తీసుకెళ్లాలి. హోటల్‌ లేదా వసతికి సంబంధించిన డిజిటల్‌ కాపీలు, బ్యాంక్‌ కార్డులు, కొంత మొత్తంలో ఫిజికల్‌ కరెన్సీ వెంట ఉంచుకోవాలి.

  • ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను సర్ది పెట్టుకోవాలి. జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, విరేచనాలు, వాంతులు తదితర సాధారణ సమస్యల నివారణ కోసం మందులు, సిరప్‌లు సిద్ధం చేసుకోవాలి.

  • ప్రయాణంలో కనీసం రెండు రోజులకు సరిపోయే విధంగా వాటర్‌ బాటిల్స్‌ ఏర్పాటు చేసుకోవాలి.

  • తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, ఎనర్జీ బార్స్‌, డార్క్‌ చాక్లెట్‌, మిల్లెట్‌ బిస్కెట్స్‌ లాంటివి తీసుకెళ్లాలి.

  • మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఛార్జర్లు, పవర్‌ బ్యాంక్‌లు, ట్రావెల్‌ అడాప్టర్‌, ఇయర్‌ ఫోన్స్‌, హెడ్‌ ఫోన్స్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

  • ప్రయాణానికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌లు, షార్ట్‌కట్‌లకు సంబంధించిన సమాచారం, జీపీఎస్‌ డివైజ్‌లను వెంట ఉంచుకోవాలి.

  • ఎండ, వాన, చలి లాంటి వాతావరణ మార్పులనుంచి రక్షణ కల్పించే దుస్తులను అదనంగా తీసుకెళ్లాలి.

  • టూత్‌ పేస్టు, టూత్‌ బ్రష్‌లు, ఫేస్‌ వాష్‌, శానిటైజర్‌, వెట్‌ వైప్స్‌, టవల్స్‌, అద్దం, దువ్వెన, సన్‌స్ర్కీన్‌, లిప్‌బామ్‌ తీసుకెళ్లాలి.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 13 , 2026 | 04:30 AM