కళ్లు చెదిరే ‘కటాన్’సిల్క్
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:04 AM
ప్రామాణికమైన కటాన్ పట్టుచీరలకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. అవేంటంటే...
ప్రామాణికమైన కటాన్ పట్టుచీరలకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. అవేంటంటే...
స్వచ్ఛమైన పట్టు దారాలు: ట్విస్టెడ్ సిల్క్‌తో తయారయ్యే ఈ పట్టు పోగులు ఎంతో మన్నికైనవి
ప్రత్యేకమైన నేత పనితనం: సాదా నేత విధానాన్ని అనుసరిస్తూ మగ్గాల సహాయంతో నేస్తారు
విలాసవంతం: డబుల్ ట్విస్టెడ్ పట్టు దారాలను ఉపయోగిస్తారు కాబట్టి ఇవి దృఢంగా ఉండడంతో పాటు మృదువుగా కూడా ఉంటాయి
అధిక మెరుపు: ఈ వస్త్రానికి సహజసిద్ధ మెరుపు ఉంటుంది
వినూత్నం: బనారస్, కాంచీపురం, పైథానీ చీరల తయారీలో కూడా కటాన్ పట్టును ఉపయోగిస్తూ ఉంటారు. బంగారు, వెండి జరాల్లో చీరలు తయారవుతూ ఉంటాయి
ఇలా గుర్తుపట్టాలి
పట్టు చీరలకు నకిలీలు సర్వసాధారణమైపోయాయి. కాబట్టి కటాన్ పట్టు చీరల విషయంలో మోసపోకుండా ఉండాలంటే ఈ చీరల ప్రత్యేక లక్షణాల పట్ల అవగాహన పెంచుకోవాలి. అవేంటంటే....
వెనక వైపు: ప్రామాణికమైన కటాన్ పట్టు చీరల మోటిఫ్ వెనక చిన్న చిన్న దారపు పోగులు కనిపిస్తాయి. మోటిఫ్స్ మరీ నునుపుగా ఉండవు. ప్రింట్‌ను తలపించవు
బరువు: వస్త్రం మృదువుగా ఉంటుంది. మందంగా ఉన్న బరువుగా ఉండదు
విశ్వసనీయమైన, సంప్రదాయ చేనేత వ్యాపారలు దగ్గరే కొనుగోలు చేయడం ఉత్తమం. అక్కడ మాత్రమే సింథటిక్ ప్రత్యామ్నాయాలకు బదులుగా నాణ్యమైన, మన్నికైన, ప్రామాణికమైన కటాన్ పట్టు చీరలు దొరుకుతాయి