Share News

కొత్తగా మొక్కలు నాటారా..?

ABN , Publish Date - Oct 24 , 2026 | 02:42 AM

కుండీల్లో మొక్కలు నాటిన మొదటి వారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...

కొత్తగా మొక్కలు నాటారా..?

  • నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలను కుండీలో నాటిన తరువాత అవి కొత్త మట్టికి అలవాటు పడేందుకు, వేర్లు స్థిరపడేందుకు కాస్త సమయం పడుతుంది. ఈ లోపు మొక్కలను తరచూ పరిశీలిస్తూ సంరక్షించాలి.

  • మొక్కను నాటిన తరువాత మట్టి తేమగా ఉండేలా నీటిని చిలకరిస్తే చాలు. ఎక్కువగా నీటిని అందిస్తే వేర్లకు గాలి అందక మొక్క వాడిపోతుంది. మట్టి తడిసిన తరువాత అదనంగా ఉన్న నీరు సులువుగా బయటికి వెళ్లేలా కుండీల అడుగున రంధ్రాలు చేయాలి.

  • మొక్కలను నాటిన వెంటనే కుండీలను ఎండలో ఉంచకూడదు. కొద్దిగా వెలుతురు సోకితే చాలు ఆ మొక్కలు చక్కగా పెరుగుతాయి. మొక్క స్వభావాన్ని అనుసరించి వాటికి ఉదయం పూట వచ్చే లేత ఎండ తగిలేలా లేదా నీడ ఉండేలా చూసుకోవాలి.

  • మొక్కను నాటిన రెండు లేదా మూడు రోజులకే ఎరువులు వేయాలంటూ దాని చుట్టూ మట్టిని తవ్వకూడదు. అలాచేస్తే వేర్లపై ఒత్తిడి పడి మొక్క వంగిపోవచ్చు.

  • కాండం మీద ఆకులపై పురుగులు కనిపించకపోయినా పురుగుమందులు పిచికారీ చేయకూడదు.

  • మొక్కలను నాటిన తరువాత రెండు లేదా మూడు రోజుల వరకూ వాటిని అలాగే వదిలివేయడం మంచిది. తరువాత పసుపు రంగులోకి మారిన ఆకులను ఎండిన కొమ్మలను జాగ్రత్తగా కత్తిరించాలి.

Updated Date - Oct 24 , 2026 | 02:50 AM