Share News

Lighten Dark Neck Skin Naturally: మెడ నల్లగా ఉందా?

ABN , Publish Date - Jan 08 , 2026 | 04:51 AM

కొంతమందికి మెడ నల్లగా మారి ఇబ్బంది కలిగిస్తుంటుంది. చిన్న చిట్కాలతో దాన్ని సులువుగా పోగొట్టుకోవచ్చు.

Lighten Dark Neck Skin Naturally: మెడ నల్లగా ఉందా?

కొంతమందికి మెడ నల్లగా మారి ఇబ్బంది కలిగిస్తుంటుంది. చిన్న చిట్కాలతో దాన్ని సులువుగా పోగొట్టుకోవచ్చు.

  • బయటికి వెళ్లేటప్పుడు ముఖం, చేతులతోపాటు మెడకు కూడా సన్‌స్ర్కీన్‌ను అప్లయ్‌ చేయడం మంచిది.

  • రాత్రి పడుకునేముందు మెడకు కొద్దిగా అలోవెరా జెల్‌ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

  • చిన్న గిన్నెలో చెంచా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, చెంచా నీళ్లు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు పట్టించి పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల బాదం నూనె లేదా కొబ్బరి నూనెను తీసుకుని కొద్దిగా వేడిచేసి దానితో మెడభాగంలో సున్నితంగా మర్దన చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పది రోజుల్లో మెడ నలుపు విరుగుతుంది.

Updated Date - Jan 08 , 2026 | 04:51 AM