పేరెంటింగ్ మంత్ర
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:15 AM
పిల్లల పెంపకం అనేది ఒక కళ. ఈ డిజిటల్ యుగంలో పిల్లలను క్రమశిక్షణతో పెంచడం తల్లిదండ్రులకు ఒక సవాల్‌గా మారింది. చెప్పింది వినడం లేదని పిల్లలను కోప్పడే కంటే వారి మనసులు గెలుచుకోవడం ముఖ్యం....
పిల్లల పెంపకం అనేది ఒక కళ. ఈ డిజిటల్ యుగంలో పిల్లలను క్రమశిక్షణతో పెంచడం తల్లిదండ్రులకు ఒక సవాల్‌గా మారింది. చెప్పింది వినడం లేదని పిల్లలను కోప్పడే కంటే వారి మనసులు గెలుచుకోవడం ముఖ్యం.
గుడ్ లిజనర్: పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారు ఏం చేశారో చెప్పాలని ఆరాటపడతారు. ఆ సమయంలో మీరు ఫోన్ చూస్తూనో, టీవీ చూస్తూనో ‘ఊ.. ఊ..’ అనకుండా వారితో కళ్లు కలిపి మాట్లాడండి. మీరు వారికి ఇచ్చే అతిపెద్ద బహుమతి ‘సమయం’.
స్ర్కీన్ టైం వర్సెస్ ప్లే టైమ్: స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లల్లో సృజనాత్మకశక్తి తగ్గిపోతోంది. భోజనం చేసేటప్పుడు యూట్యూబ్ చూపించే అలవాటు అస్సలు వద్దు. దానికి బదులు చందమామ కథలు చెప్పండి. సాయంత్రం వేళల్లో గంటసేపు పార్కుకో, మైదానానికో తీసుకెళ్లి శారీరక శ్రమ ఉండే ఆటలు ఆడించండి.
ప్రోత్సాహం: మీ బిడ్డ చిన్న గీత గీసినా, పక్కవారికి సాయం చేసినా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. ‘భలే చేశావ్ నాన్నా’ అనే ఒక్క మాట వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. తప్పు చేసినప్పుడు అందరి ముందు తిట్టకుండా, విడిగా ఉన్నప్పుడు ప్రేమగా నచ్చజెప్పండి. పిల్లలు మీ మాటల కంటే మీ ప్రవర్తనను ఎక్కువగా అనుకరిస్తారని మర్చిపోవద్దు.