Share News

కాఫీపొడి గడ్డకట్టకుండా

ABN , Publish Date - Oct 03 , 2026 | 01:11 AM

డబ్బాలో పోసిన కాఫీ పొడి ఒక్కోసారి పూర్తిగా గట్టిపడడం, గడ్డలు కట్టడం చూస్తుంటాం. దీనికి కారణం అది గాలిలోని తేమను పీల్చుకోవడమే. అలాకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

కాఫీపొడి గడ్డకట్టకుండా

డబ్బాలో పోసిన కాఫీ పొడి ఒక్కోసారి పూర్తిగా గట్టిపడడం, గడ్డలు కట్టడం చూస్తుంటాం. దీనికి కారణం అది గాలిలోని తేమను పీల్చుకోవడమే. అలాకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...

  • ప్యాకెట్‌ను తెరచిన తరువాత అలాగే ఉంచకుండా వెంటనే కాఫీ పొడిని ఎయిర్‌ టైట్‌ కంటైనర్‌లోకి మార్చాలి. అంతకు ముందే కంటైనర్‌లో తేమ లేకుండా పొడి తువాలుతో గట్టిగా తుడవాలి. ఏమాత్రం చెమ్మ తగిలినా కాఫీ పొడి గడ్డకడుతుంది.

  • కాపీ పొడిని తీసుకోవడానికి పొడి చెంచాను వాడాలి. మరుగుతున్న నీళ్లు లేదా పాలలో కాఫీ పొడి వేసిన చెంచాకు ఆవిరి తగలవచ్చు. దాన్ని మళ్లీ కంటైనర్‌లో పెట్టకూడదు.

  • ఎక్కువసేపు కంటైనర్‌ మూత తీసి ఉంచకూడదు. అలాగే మాటిమాటికీ మూత తీయకూడదు. చల్లగాలి తగిలినా కాఫీ పొడి గట్టిపడుతుంది. ఆ రోజు అవసరాన్ని బట్టి కావాల్సినంత కాఫీ పొడిని చిన్న గిన్నెలోకి తీసుకుని అందుబాటులో ఉంచుకోవడం మంచిది.

  • కాఫీ పొడి నిల్వ చేసిన సీసా, ప్లాస్టిక్‌ డబ్బా, కంటైనర్లను స్టవ్‌, సింక్‌లకు దగ్గరలో ఉంచకూడదు. అలా ఉంచితే వేడి ఆవిరి లేదా తేమ కాఫీ పొడిలోకి చేరవచ్చు. ఎక్కువగా సూర్యరశ్మి తగలకుండా పొడిగా ఉండే అరల్లో కాఫీ పొడి డబ్బాను ఉంచాలి.

  • కాఫీ పొడిని మొత్తం ఒకేసారి డబ్బాలో పోయకుండా కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిది. మిగిలిన ప్యాకెట్‌ను మరో డబ్బాలో పెట్టి గట్టిగా మూత బిగించాలి.

Updated Date - Oct 03 , 2026 | 01:11 AM