Share News

ఇలా చేస్తే మరకలు మాయం

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:57 AM

దుస్తులపై మరకలు పడడం సాధారణం. వీటిని పోగొట్టే ప్రయత్నంలో సబ్బుతో గట్టిగా రుద్దడం వల్ల దుస్తులు రంగు వెలిసిపోవడం, పాతబడడం చూస్తుంటాం. అలాకాకుండా రకరకాల మరకలను చిన్న చిట్కాలతో సులభంగా ఎలా వదిలించాలో తెలుసుకుందాం...

ఇలా చేస్తే మరకలు మాయం

దుస్తులపై మరకలు పడడం సాధారణం. వీటిని పోగొట్టే ప్రయత్నంలో సబ్బుతో గట్టిగా రుద్దడం వల్ల దుస్తులు రంగు వెలిసిపోవడం, పాతబడడం చూస్తుంటాం. అలాకాకుండా రకరకాల మరకలను చిన్న చిట్కాలతో సులభంగా ఎలా వదిలించాలో తెలుసుకుందాం...

  • తుప్పు, దుమ్ము, బురద, పక్షుల రెట్టల వల్ల ఏర్పడే మరకలను వైట్‌ వెనిగర్‌తో పోగొట్టవచ్చు. మరక పడిన ప్రదేశంలో చెంచా వైట్‌ వెనిగర్‌ వేసి పావుగంటసేపు అలాగే ఉంచాలి. ఆపైన పలుచని తువాలు లేదా రుమాలుతో మెల్లగా రుద్ది ఎండ తగిలేలా ఆరేయాలి. అరగంట తరువాత నీళ్లలో ముంచి డిటర్జెంట్‌ లేదా సబ్బుతో రుద్ది ఉతికేస్తే మరకలు తొలగిపోతాయి.

  • స్కూల్‌ పిల్లలు, కాలేజీలకు వెళ్లేవారు సాధారణంగా ఎదుర్కొనే సమస్య దుస్తులపై బాల్‌పాయింట్‌ పెన్‌ లేదా ఇంక్‌ మరకలు పడడం. వీటిపై కొద్దిగా రబ్బింగ్‌ ఆల్కహాల్‌ను చల్లి అరగంటసేపు నాననివ్వాలి. తరువాత లిక్విడ్‌ డిటర్జెంట్‌ లేదా హ్యాండ్‌ వాష్‌ రాసి చేత్తో రుద్ది ఉతికితే మరకలు పూర్తిగా మాయమవుతాయి.

  • చిన్న పిల్లలు తరచూ దుస్తులపై స్కెచ్‌ పెన్‌, మార్కర్‌, వాటర్‌ కలర్స్‌కు సంబంధించిన మరకలు అంటించుకుంటూ ఉంటారు. వీటిపై కొద్దిగా నెయిల్‌ పాలిష్‌ రిమూవర్‌ వేసి బాగా రుద్దాలి. తరువాత లిక్విడ్‌ డిటర్జెంట్‌ రాసి పాత టూత్‌ బ్రష్‌తో రుద్దితే మరకలు పూర్తిగా పోతాయి.

  • దుస్తులపై నూనె, జ్యూస్‌, సూప్‌, ఆహారానికి సంబంధించిన మరకలు పడినప్పుడు వాటిపై టూత్‌పేస్టు లేదా నిమ్మకాయ రసం రాసి ఆపైన లిక్విడ్‌ డిటర్జెంట్‌ కలిపిన నీళ్లలో నానబెట్టి ఉతికితే తేలికగా మరకలు తొలగి పోతాయి.

Updated Date - Mar 25 , 2026 | 04:57 AM