Share News

మిక్సీ జార్‌ బేస్‌ క్లీనింగ్‌ ఇలా...

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:01 AM

మిక్సీ గిన్నెను వాడిన తరువాత లోపలి భాగాన్ని వెంటనే శుభ్రం చేసేస్తాం. కానీ అడుగున బ్లేడ్ల చుట్టూ ఉన్న భాగాన్ని వదిలేస్తాం. ఇక్కడ కూడా మురికి, జిడ్డు ఎక్కువగా చేరుతుంటాయి. మిక్సీ జార్‌ బేస్‌ను ఎప్పటికప్పుడు సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

మిక్సీ జార్‌ బేస్‌ క్లీనింగ్‌ ఇలా...

మిక్సీ గిన్నెను వాడిన తరువాత లోపలి భాగాన్ని వెంటనే శుభ్రం చేసేస్తాం. కానీ అడుగున బ్లేడ్ల చుట్టూ ఉన్న భాగాన్ని వదిలేస్తాం. ఇక్కడ కూడా మురికి, జిడ్డు ఎక్కువగా చేరుతుంటాయి. మిక్సీ జార్‌ బేస్‌ను ఎప్పటికప్పుడు సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

  • మిక్సీ గిన్నెను టేబుల్‌ మీద బోర్లించి ఉంచాలి. అడుగు భాగంలో చెంచా బేకింగ్‌ సోడా చల్లి నిమ్మరసం పిండాలి. తరువాత చెంచా డిటర్జెంట్‌ పౌడర్‌ వేసి కొన్ని వేడినీళ్లు చిలకరించాలి. పావు గంట నాననివ్వాలి. పాత టూత్‌ బ్రష్‌తో బాగా రుద్ది కడిగితే జార్‌ శుభ్రంగా ఉంటుంది.

  • చిన్న గిన్నెలో చెంచా వెనిగర్‌, అర చెంచా బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నె అడుగు భాగంలో వేసి టూత్‌ బ్రష్‌తో రుద్ది కడిగినా ఫలితం కనిపిస్తుంది.

  • ఒక గిన్నెలో చెంచా డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌, చెంచా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టూత్‌బ్రష్‌తో తీసుకుంటూ మిక్సీ గిన్నె అడుగు భాగాన్ని గట్టిగా రుద్దాలి. అయిదు నిమిషాల తరువాత స్క్రబ్బర్‌తో తోమి మంచినీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.

Updated Date - Mar 25 , 2026 | 05:01 AM