ధోతీ కుర్తా సెట్లతో దర్జాగా
ABN , Publish Date - Sep 30 , 2026 | 04:19 AM
ఫ్యాషన్‌గా కనిపిస్తూనే ట్రెడిషనల్ లుక్‌నిచ్చే ధోతి కుర్తా సెట్లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. హల్దీ/సంగీత్, వివాహాది శుభకార్యాలు, రిసెప్షన్లు, పండుగల సందర్భాల్లో ఈ ఎథ్నిక్ వేర్‌ను ధరించి యువతులు సందడి చేస్తున్నారు.
ఫ్యాషన్‌గా కనిపిస్తూనే ట్రెడిషనల్ లుక్‌నిచ్చే ధోతి కుర్తా సెట్లు ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. హల్దీ/సంగీత్, వివాహాది శుభకార్యాలు, రిసెప్షన్లు, పండుగల సందర్భాల్లో ఈ ఎథ్నిక్ వేర్‌ను ధరించి యువతులు సందడి చేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల కంటే ఈ డ్రెస్‌తో డ్యాన్స్ చేయడం బాగుంటుందని పలువురు మహిళలు అంటున్నారు. క్యాజువల్ వేర్‌గా కూడా ఈ డ్రెస్ అందుబాటులో ఉంటోంది. ఫ్యాన్సీ చీరలు, లెహంగాలకు ధీటుగా నిలుస్తున్న ఈ ఇండో వెస్ట్రన్ ఫ్యూజన్ డ్రెస్‌పై ఓ లుక్కేద్దామా..!
సంప్రదాయ ధోతీలా కుచ్చిళ్లతో కనిపించే ప్యాంట్ ఈ డ్రెస్ ప్రత్యేకత. నడుము వద్ద ఎలాస్టిక్‌ను జోడించడం వల్ల ధరించడం సులువుగా ఉంటుంది. దీనిమీదికి ఎంబ్రాయిడరీ వర్క్, లేస్ వర్క్‌లు చేసిన షార్ట్ లేదా మీడియం లెంగ్త్ కుర్తాలు, ట్యూనిక్స్ అందంగా సూటవుతాయి. ఆపైన మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ కలర్ సాఫ్ట్ నెట్ దుపట్టా కానీ సిల్క్ చున్నీ కానీ వేసుకుంటే డ్రెస్‌కు రిచ్ లుక్ వస్తుంది. షిఫాన్ లేదా ఆర్గంజా దుపట్టాను భుజం మీదుగా ఒక వైపున వేసుకుంటే డ్రెస్ గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది.
యువతులు ధోతీ ప్యాంట్లతో క్రాప్ టాప్స్, లాంగ్ ష్రగ్స్‌ను కూడా జతచేస్తున్నారు.
ఒకవైపు పొట్టిగా మరోవైపు పొడవుగా ఉండే అసెమిట్రికల్ కుర్తాలు వీటిపై స్టయిలిష్ లుక్‌నిస్తాయి. కాటన్, రేయాన్, సిల్క్ బ్లెండ్, జార్జెట్, చందేరీ సిల్క్ ఫ్యాబ్రిక్‌లతో రూపొందించిన ధోతీ ప్యాంట్లపై అంగ్రఖా, ఏ-లైన్, ప్రింటెడ్, జర్దోసీ వర్క్ కుర్తాలను ధరిస్తే గ్రాండ్ లుక్ వస్తుంది.
ఈ డ్రెస్ మీదికి సింపుల్ జుంకాలు, పెండెంట్ చోకర్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అందంగా సూటవుతాయి. పెద్దగా హెయిర్ స్టయిల్స్, ముఖానికి మేకప్ అవసరం లేదు. పాదాలకు జుట్టీలు, మోజరీలు, కొల్హాపురి చప్పల్స్ ధరిస్తే ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది.