Share News

మేకప్‌ మిస్టేక్స్‌

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:05 AM

సాధారణంగా మేక్‌పలో దొర్లే కొన్ని తప్పుల వల్ల వయసు పైబడినట్టు లేదా మాస్క్‌ వేసుకున్నట్టు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. అందుకోసం...

మేకప్‌ మిస్టేక్స్‌

ప్రిపరేషన్‌: కొందరు శుభ్రం చేయకుండా, పొడిగా ఉన్న ముఖానికి నేరుగా ఫౌండేషన్‌ పూసేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫౌండేషన్‌ చర్మపు గీతల్లోకి చేరిపోయి, పొట్టులా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మేక్‌పకు ముందు ముఖాన్ని శుభ్రంచేసుకుని ప్రైమర్‌ అప్లైచేసుకోవాలి.

ఫౌండేషన్‌: ఎంచుకునే ఫౌండేషన్‌ ముఖానికి బదులుగా మెడతో మ్యాచ్‌ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే ముఖ చర్మం ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. సరైన ఫౌండేషన్‌ను ఎంచుకోవడం కోసం సహజసిద్ధ వెలుగులో దవడకు పూసుకుని పరీక్షించాలి. అలాగే ముఖం మధ్యలో ఫౌండేషన్‌ అప్లికేషన్‌ మొదలుపెట్టి, బయటివైపుకు బ్లెండ్‌ చేయాలి.

కన్‌సీలర్‌: కనురెప్పలకు చేరువలో, కంటి దిగువన కన్‌సీలర్‌ను మందంగా అప్లై చేస్తే, లోతైన గీతలు ఏర్పడతాయి. కాబట్టి లైట్‌ వెయిట్‌ ఫార్ములా కన్‌సీలర్‌ను ఎంచుకోవాలి. అలాగే తక్కువ మోతాదు కన్‌సీలర్‌ అప్లై చేసుకోవాలి.

పౌడర్‌: లూజ్‌ పౌడర్‌ను మొహం మొత్తం అద్దుకోకూడదు. టి జోన్‌ (నుదురు, ముక్కు, చుబుకం)లో చిన్న బ్రష్‌ లేదా ప్రెస్‌డ్‌ పఫ్‌తో కొద్దిపాటి పౌడర్‌ అద్దుకోవాలి.

బ్లష్‌: చీక్‌ బోన్స్‌కు మరీ దిగువన బ్లష్‌ అద్దుకుంటే, ఫేసియల్‌ ఫీచర్స్‌ కిందకు జారినట్టు కనిపిస్తాయి. కాబట్టి బ్రష్‌తో బ్లష్‌ను చీక్‌ బోన్స్‌లో ఎత్తుగా ఉన్న ప్రదేశాల దగ్గర అప్లై చేసి, కణతల వైపు బ్లెండ్‌ చేయాలి.

ఐలైనర్‌: కనుబొమలను మరీ నల్లగా దిద్దుకోకూడదు. అలాగే కింది కనురెప్పకు కూడా డార్క్‌ లైనర్‌ ఉపయోగించకూడదు. బదులుగా మెత్తని గ్రాఫైట్‌ లేదా ప్లమ్‌ టోన్స్‌తో కూడిన ఐబ్రో పెన్సిల్‌ను తీసుకుని, కనుబొమల వెంట్రుకల దగ్గర అప్‌వార్డ్‌ స్ట్రోక్స్‌ ప్రయత్నించాలి.

Updated Date - Nov 14 , 2026 | 12:06 AM