Share News

ఆముదంతో ఇలా...

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:16 AM

చలికాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలను నివారించడానికి ఆముదాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం...

ఆముదంతో ఇలా...

  • రెండు చెంచాల ఆముదంలో అరచెంచా కలబంద గుజ్జు, చెంచా గులాబీ నీళ్లు, అరచెంచా బాదం నూనె కలుపుకుని నైట్‌ సీరమ్‌లా వాడుకోవచ్చు. పొడిబారి పగిలిన పాదాలకూ బాగా పనిచేస్తుంది.

  • పావుచెంచా ఆముదంలో నాలుగైదు చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి మాయిశ్చరైజర్‌లా రాసుకోవచ్చు. ఇది చర్మాన్ని తేమతో నింపుతుంది.

  • మూడు వంతుల బాదం నూనెలో ఒక వంతు ఆముదం కలిపి గాజు సీసాలో భద్రపరచుకోవాలి. దీన్ని చూపుడు వేలితో కొద్దిగా తీసుకుని పగిలిన పెదాలకు రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని లిప్‌గ్లా్‌సలా కూడా వాడవచ్చు. రాత్రి పడుకునేముందు కనుబొమలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి. కళ్ల చుట్టూ ఈ నూనె మిశ్రమాన్ని రాసి సున్నితంగా మర్దన చేస్తే నల్లటి వలయాలు మాయమవుతాయి.

  • ఆముదాన్ని కొద్దిగా వేడిచేసి రెండు మూడు చుక్కలను ముఖానికి రాస్తే మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, నుదుటిమీద గీతలు, మూతి చుట్టూ ముడుతలు పోతాయి. ఆముదంలోని రిసినోలిక్‌ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, ఇ విటమిన్‌ చర్మం బిగుతుగా నిగారించేలా చేస్తాయి.

Updated Date - Nov 28 , 2026 | 12:18 AM