Share News

యాలకుల నీటిని తాగుదాం

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:28 AM

రోజూ ఉదయాన్నే పరగడుపున యాలకులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

యాలకుల నీటిని తాగుదాం

రోజూ ఉదయాన్నే పరగడుపున యాలకులతో మరిగించిన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

  • యాలకుల్లో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. ఇవి నోటిలోని హానికార బ్యాక్టీరియాలను నాశనం చేసి చిగుళ్లు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నాలుక, దంతాలపై ఎక్కువగా పాచి పేరుకోకుండా చేస్తాయి. నోటి దుర్వాసన మాయమై రోజంతా తాజా అనుభూతి కలుగుతుంది.

  • రోజూ కప్పు చొప్పున ఆర్నెల్లపాటు యాలకుల నీటిని తాగుతుంటే రక్తపోటు అదుపులోకి వచ్చేస్తుంది. రక్తంలో చేరిన చెడు కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయి పెరిగి గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.

  • యాలకుల సువాసనకు నాడీవ్యవస్థ ప్రభావితమవుతుంది. యాలకుల నీటిని తాగిన వెంటనే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనసు ప్రశాంతంగా అహ్లాదకరంగా మారుతుంది. రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది.

  • పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఊబకాయంతో బాధపడేవారికి యాలకుల నీరు ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి అదనపు క్యాలరీలను సులభంగా కరిగిస్తుంది. దీంతో అతి తక్కువ కాలంలోనే శరీర బరువు నియంత్రణలోకి వచ్చేస్తుంది.

  • జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపులో ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం, మలబద్దకం లాంటి సమస్యలన్నీ క్రమంగా మాయమవుతాయి.

  • శరీరంలోని వ్యర్థాలన్నీ విసర్జితమవుతాయి. రక్తప్రసరణ సజావుగా జరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది.

  • యాలకుల నీటిలో డైయురెటిక్‌ గుణాలు ఉంటాయి. ఇవి మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. దీంతో మూత్ర సంబంధిత సమస్యలు దరి చేరవు.

Updated Date - Sep 30 , 2026 | 04:28 AM