ఎముకలు విరిగే ముప్పు వాళ్లకూ ఎక్కువే!
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:53 AM
ఎముకలు గుల్లబారి విరిగిపోయే అవకాశాలు మహిళలతో పాటు పురుషులకూ ఎక్కువే! బ్యాంకులో డబ్బు నిల్వ చేసుకున్నట్టు...
ఎముకలు గుల్లబారి విరిగిపోయే అవకాశాలు మహిళలతో పాటు పురుషులకూ ఎక్కువే! బ్యాంకులో డబ్బు నిల్వ చేసుకున్నట్టు, ముది వయసులో ఎముక దారుఢ్యం కోసం టీనేజీ వయసులోనే ఎముకల ఆరోగ్యాన్ని ముదుపు చేసుకోవాలి.
50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి, ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరికి ఎముకలు గుల్లబారి విరిగిపోతూ ఉంటాయి. ఆడపిల్లల్లో 18 ఏళ్లకూ, మగపిల్లల్లో 20 ఏళ్లకు వాళ్ల బోన్ బ్యాంక్ నిండుతుంది. అంటే ఆ వయసుకు చేరుకునే సమయానికి వాళ్ల ఎముకలు దాదాపు 90 శాతం మేరకు సామర్థ్యాన్ని పొందుతాయి. 30 ఏళ్లకు నూటికి నూరు శాతం దృఢంగా మారతాయి. 70లలో ఎముక సామర్థ్యం ఈ 30 ఏళ్ల నాటి దృఢత్వం మీదే ఆధారపడి ఉంటుంది.
ఆ తర్వాత నుంచి గడిచే ఒక్కో ఏడాదీ బోన్ బ్యాంక్ స్వల్ప మొత్తాల్లో ఖాళీ అవడం మొదలుపెడుతుంది. అయితే మహిళల్లో మెనోపాజ్ సమయంలో ఎముక సాంద్రత 20 శాతం మేరకు క్షీణిస్తుంది. పురుషుల్లో కూడా పైబడే వయసుతో ఎముకలు దారుఢ్యం కోల్పోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే టీనేజీ వయసులోనే ఎముకలను సాధ్యమైనంత దృఢపరుచుకోవాలి. అందుకోసం క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలి. నేల మీద ఆడే ప్రతి క్రీడతో ఎముకలు దృఢపడుతూ ఉంటాయి.