Share News

చెక్కుచెదరని అందం కోసం...

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:05 AM

వాతావరణంలో తేమ పెరిగినప్పుడు, వేసుకునే మేక్‌పలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రత్యేకించి జిడ్డు పెరిగే అవకాశం లేని లైట్‌వెయిట్‌ మేక్‌పనే ఎంచుకోవాలి.

చెక్కుచెదరని అందం కోసం...

వాతావరణంలో తేమ పెరిగినప్పుడు, వేసుకునే మేక్‌పలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రత్యేకించి జిడ్డు పెరిగే అవకాశం లేని లైట్‌వెయిట్‌ మేక్‌పనే ఎంచుకోవాలి. అందుకోసం...

వాతావరణ మార్పులు మేకప్‌ మీద స్పష్టమైన ప్రభావాన్ని కనబరుస్తాయి. మరీ ముఖ్యంగా వాతావరణంలో తేమ పెరిగినప్పుడు చర్మం జిడ్డుగా మారిపోతుంది. కాబట్టి చర్మపు జిడ్డును పెంచకుండా, తాజాగా, పొడిగా ఉంచే మేకప్‌ మెలకువలు పాటించాలి.

లైట్‌వెయిట్‌ మాయిశ్చరైజర్‌:

వేగంగా తేమను పీల్చుకునే జెల్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. అలాగే వేసుకున్న మేకప్‌ చెక్కుచెదరకుండా ఉండడం కోసం నాన్‌ గ్రీజీ సన్‌స్ర్కీన్‌ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి.

మ్యాట్‌ ప్రైమర్‌:

ఆయిల్‌ కంట్రోల్‌ లేదా సిలికాన్‌ ఆధారిత ప్రైమర్‌ను ఎంచుకోవాలి. ముఖంలోని టి జోన్‌లో... ఈ ప్రైమర్‌ను అప్లై చేసుకోవాలి.

లాంగ్‌ వేర్‌ ఫౌండేషన్‌:

ట్రాన్ఫర్‌ రెసిస్టెంట్‌, పాలిమర్‌ లాక్‌ ఫార్ములాలతో రూపొందిన ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి.

సెట్టింగ్‌:

బేస్‌ను అప్లై చేసిన తర్వాత, ఆ పొరలను పట్టి ఉంచడం కోసం సెట్టింగ్‌ స్ర్పే వాడుకోవాలి.

  • కళ్లు - పెదవులు

వాటర్‌ప్రూఫ్‌ ఉత్పత్తులు:

ఐ ప్రైమర్‌, జెల్‌ ఐలైనర్‌, వాటర్‌ప్రూఫ్‌ మస్కారాలను ఎంచుకుంటే, వాతావరణంలోని తేమకు మేకప్‌ చెక్కుచెదరకుండా ఉంటుంది.

పౌడర్‌:

క్రీమ్‌ ఫార్ములాలకు బదులుగా పౌడర్‌ ఆధారిత ఐషాడోలను వాడుకోవాలి. క్రీమ్‌ ఫార్ములాలు కలిగిన మేకప్‌ ఉత్పత్తులతో ముఖం మీద సులభంగా ముడతలు ఏర్పడతాయి.

మ్యాట్‌ లిప్స్‌:

స్మడ్జ్‌ ప్రూఫ్‌ మ్యాట్‌ లిక్విడ్‌ లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. లేదా లాంగ్‌ వేరింగ్‌ లిప్‌ స్టెయిన్‌ను వాడుకోవాలి.

Updated Date - Oct 10 , 2026 | 12:05 AM