Share News

ఉచితాలు కాదు.. విజయ్‌ మాటనే నమ్మారు..

ABN , Publish Date - May 05 , 2026 | 04:21 AM

ఉచిత హామీలు గుప్పిస్తే అధికారంలోకి వచ్చేస్తారా? ఉన్న అధికారాన్ని నిలుపుకోవచ్చా!? అనుచితమే అయినప్పటికీ...

ఉచితాలు కాదు.. విజయ్‌ మాటనే నమ్మారు..

చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): ఉచిత హామీలు గుప్పిస్తే అధికారంలోకి వచ్చేస్తారా? ఉన్న అధికారాన్ని నిలుపుకోవచ్చా!? అనుచితమే అయినప్పటికీ... ఉచితమే మార్గమా? కొన్నిసార్లు ఇది ఫలించవచ్చు కానీ, అన్నిసార్లూ కాదని తమిళ ఎన్నికలు రుజువు చేశాయి. విజయ్‌ తరహా కొత్త ‘ట్రెండు’ మొదలైనప్పుడు భారీ ఉచిత హామీలు పని చేయవని స్పష్టమైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు హామీలు గుప్పించడంలో పోటీపడ్డాయి. డీఎంకే అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న హామీలతోపాటు కొత్తగా ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేసేందుకు రూ.8 వేల కూపన్‌ వంటి హామీలు ఇచ్చింది. ఇక అన్నాడీఎంకే ఏటా ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు, రేషన్‌కార్డు దారులకు ఫ్రిజ్‌, సిటీ, టౌన్‌ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణం, బియ్యం కార్డుదారులకు ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు వంటి పథకాలను ప్రకటించింది. ఈ రెండు పార్టీల హామీలను ఓటర్లు తిరస్కరించారు. టీవీకే అధినేత విజయ్‌... ప్రతి కుటుంబానికి ఏటా 6 గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, నిరుపేద యువతి పెళ్లికి 8 గ్రాముల బంగారం వంటి వంటి హామీలిచ్చి.. గెలిచారు.

Updated Date - May 05 , 2026 | 04:21 AM