కాంగ్రెస్ నుంచి ఏర్పడిన పార్టీలన్నీ తిరిగి ఏకం కావాలి
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:45 AM
కాంగ్రెస్ నుంచి ఏర్పడిన రాజకీయ పార్టీలన్నీ మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీతో కలవాలని శివసేన(ఉద్ధవ్ వర్గం) సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు.
శరద్ పవార్ చొరవ తీసుకోవాలి: రౌత్
పుణె, జూన్ 13: కాంగ్రెస్ నుంచి ఏర్పడిన రాజకీయ పార్టీలన్నీ మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీతో కలవాలని శివసేన(ఉద్ధవ్ వర్గం) సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. అందరూ కలిసికట్టుగా పోరాడితేనే బీజేపీ కుటిల రాజకీయాలను ఎదుర్కోగలమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీపై పోరాటానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉందన్నారు. కాంగ్రెస్ నుంచి ఏర్పడిన పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ చొరవ తీసుకోవాలని రౌత్ ఈ సందర్భంగా కోరారు.