Share News

సర్కారుపై పోరులో అన్నాడీఎంకే వెనుకబాటు

ABN , Publish Date - May 05 , 2026 | 04:25 AM

అధికార డీఎంకేపై అవినీతి ఆరోపణలు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో పాటు జాతీయ నేతల ప్రచారంతో మళ్లీ అధికారం దక్కించుకోవచ్చనుకున్న ...

సర్కారుపై పోరులో అన్నాడీఎంకే వెనుకబాటు

చెన్నై, మే 4 (ఆంధ్రజ్యోతి): అధికార డీఎంకేపై అవినీతి ఆరోపణలు, ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో పాటు జాతీయ నేతల ప్రచారంతో మళ్లీ అధికారం దక్కించుకోవచ్చనుకున్న అన్నాడీఎంకే ఆశలు అడియాశలే అయ్యాయి. కరిష్మా వున్న నేత లేకపోవడం, పార్టీలో చీలికలే కొంప ముంచాయని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి పాలనాదక్షుడిగా పేరుంది. అన్నాడీఎంకేను చేజిక్కించుకోవడంలో ఆయన చూపిన చాణక్యత బహిరంగ రహస్యమే. దీనికితోడు ప్రధానని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాధ్‌సింగ్‌, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి తీవ్ర ప్రచారం చేశారు. అయినా, ఫలితాల్లో మార్పు లేకపోవడాన్ని ఆ పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పళనిస్వామి కొంత వెనుకబడినట్లు భావిస్తున్నాయి.

Updated Date - May 05 , 2026 | 04:25 AM