-
-
Home » Mukhyaamshalu » Andhrapradesh Telangana National International news ABN Andhrajyothy Live Updates of 8th March 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 08 , 2026 | 06:29 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 08, 2026 08:24 IST
రియాద్‌లో డ్రోన్ అటాక్
రియాద్‌పై ఇరాన్ డ్రోన్ అటాక్
అడ్డుకున్న సౌదీ రక్షణ దళాలు
-
Mar 08, 2026 08:12 IST
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సంతల్ సమావేశంపై డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్
సమావేశం నిర్వహణపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసిన పవన్
సంతల్ సమాజం సంస్కృతి భాగస్వామ్యం, గౌరవాన్ని కొనసాగించాలి: పవన్
సంతల్ సమాజ సభ్యులు సమావేశానికి అంతరాయం ఏర్పడటం విచారకరం: పవన్
-
Mar 08, 2026 08:09 IST
నంద్యాల: హంద్రీనీవా సరికొత్త రికార్డు
మల్యాల లిఫ్ట్ నుంచి 50 టీఎంసీలు ఎత్తిపోత
-
Mar 08, 2026 08:08 IST
అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ పేరు, లోగో ఆవిష్కరించినున్న సీఎం చంద్రబాబు
మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
-
Mar 08, 2026 08:08 IST
నేడు తెలంగాణ అసెంబ్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
నేడు ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి ప్రారంభోత్సవం
-
Mar 08, 2026 08:07 IST
నంద్యాల: ఆళ్లగడ్డ మండలం అహోబిలం మఠం సీఈఓ రామానుజన్ రాజీనామా
-
Mar 08, 2026 08:07 IST
అమెరికాతో చర్చలు జరపబోమన్న ఇరాన్‌పై స్పందించిన ట్రంప్
ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ ప్రకటన
యుద్ధం ఇక్కడితో ఆగదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
తదుపరి దశలో ఇరాన్‌కు ఊహించని 'సర్‌ప్రైజ్‌లు' ఇస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని
-
Mar 08, 2026 07:51 IST
దేశంలో స్థిరంగా బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,640
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.90 లక్షలు
-
Mar 08, 2026 07:16 IST
కర్నూలు జిల్లాలో చిరుత పులి కలకలం
అస్పరి మండలం కలపర్రి గ్రామంలో చిరుత సంచారం
భయాందోళనలో గ్రామ ప్రజలు
అటవీ శాఖ అధికారులకు సమాచారం
-
Mar 08, 2026 06:52 IST
వరల్డ్ కప్ ఫైనల్
నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్
తలపడనున్న భారత్, న్యూజిలాండ్ జట్లు
రాత్రి 7గంటలకు అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభం
-
Mar 08, 2026 06:40 IST
కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో పొగలు
భయంతో దిగిపోయిన ప్రయాణికులు
మరో బస్సు ఏర్పాటు చేయాలని ప్రయాణికుల డిమాండ్
మళ్లీ అదే బస్సు ఎక్కాలన్న డ్రైవర్, హైవేపై ప్రయాణికుల నిరీక్షణ
యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద ఘటన
-
Mar 08, 2026 06:29 IST
కామారెడ్డి ఆర్బీనగర్ కాలనీలో విషాదం
అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యం
కామారెడ్డి చెరువులో అయత్, మరియం మృతదేహాలు గుర్తింపు
మరో చిన్నారి సీపత్ కోసం కొనసాగుతున్న గాలింపు
చిన్నారులను కన్నతండ్రే హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసుల అనుమానం