కొత్తగా పెళ్లైన యువతులు గూగుల్‌లో వెతికే అంశాలు ఇవే
ABN , Publish Date - Apr 26 , 2026 | 10:19 PM
కొత్తగా పెళ్లైన యువతులు గూగుల్‌లో ఏయే అంశాల గురించి సెర్చ్ చేస్తారంటే..
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఏ సమాచారం కావాలన్నా జనాలు నెట్టింట వెతుకుతుంటారు. తమ జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు గూగుల్‌లో పరిష్కారాల గురించి అన్వేషిస్తారు. వ్యక్తులు, వారి నేపథ్యాలను అనుసరించి ఈ సెర్చ్‌లు ఉంటాయి. ఇక కొత్తగా పెళ్లైన యువతులు కూడా కొత్త జీవితంలో వచ్చే సమస్యలు, సందేహాలకు సమాధానాల కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా వెతికే అంశాలు ఏవంటే..
తమ భర్తల మనసులను ఎలా గెలుచుకోవాలనే అంశంపై యువతులు ఎక్కువగా సెర్చ్ చేస్తారు. భర్త సంతోషంగా ఉంటే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందనే ఉద్దేశంతో ఈ అంశంపై గూగుల్‌లో సెర్చ్ చేస్తారు.
భర్తలు తమ మాటకు కట్టుబడి ఉండేలా ఏం చేయాలని గూగుల్‌లో వేతికే యువతులు కూడా ఉన్నారు. జీవిత భాగస్వామి తాము చెప్పినట్టు వినడం కొందరికి భద్రతా భావాన్ని కలుగజేస్తుందట.
ఏ వయసులో పిల్లల్ని కనాలి? భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలపై కూడా కొత్తగా పెళ్లైన యువతులు గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు.
అత్తవారింటి పరిస్థితులకు ఎలా అలవాటు పడాలనే విషయంలో సూచనలు సలహాల కోసం కొందరు యువతులు గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు. సరైన నడవడిక, ఇతర కుటుంబసభ్యులతో సంబంధ బాంధవ్యాలు నెరపడంలో సలహాల కోసం వెతుకుతారు.
అత్తవారింటికి వెళ్లాక కోడలిగా తన బాధ్యతలను ఎలా నిర్వర్తించాలనే విషయంలో కూడా కొందరు గూగుల్‌లో సూచనల కోసం వెతుకుతుంటారు. ముఖ్యంగా చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారు ఇలాంటి విషయాల్లో గూగుల్ సాయం తీసుకుంటారు.
పెళ్లి తరువాత కుటుంబం, కెరీర్‌కు సమప్రాధాన్యం ఇవ్వడంలో కొందరు యువతులు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు. కెరీర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారు ఈ దిశగా గూగుల్‌లో సలహాలు, మార్గదర్శకాల కోసం అన్వేషిస్తారు