ఇతరుల బట్టలు వేసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:29 PM
స్నేహితులు, బంధువులు లేదా తోబుట్టువుల బట్టలు వేసుకోవడం ఈ రోజుల్లో సాధారణ విషయమే. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులు వాడిన దుస్తులు ధరించడం వల్ల వారి శక్తి మనపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో స్నేహితులు, తోబుట్టువులు లేదా బంధువుల బట్టలు వేసుకోవడం చాలా సాధారణమైంది. కొన్నిసార్లు ఫ్యాషన్ కోసం, మరికొన్నిసార్లు అవసరం వల్ల ఇతరుల దుస్తులు ధరిస్తుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇతరులు వాడిన బట్టలు ధరించడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చని చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కువసేపు ధరించిన దుస్తులు ఆ వ్యక్తి శక్తిని గ్రహిస్తాయని విశ్వసిస్తారు. అందుకే ఇతరుల బట్టలు వేసుకున్నప్పుడు ఆ శక్తి ప్రభావం మనపై కూడా పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ప్రతికూల శక్తి ప్రభావం
ఎవరైనా ఎక్కువ కాలం అనారోగ్యంతో బాధపడుతున్నా, తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నా లేదా ఎప్పుడూ సమస్యలతో సతమతమవుతున్నా, వారి ప్రతికూల శక్తి వారు ధరించిన దుస్తులపై కూడా ప్రభావం చూపుతుందని వాస్తు నమ్మకం. అలాంటి దుస్తులు ధరిస్తే మనలో కూడా ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఆత్మవిశ్వాసంపై ప్రభావం
మనకు సంబంధించిన శుభ్రమైన బట్టలు వేసుకున్నప్పుడు మనలో ఆత్మవిశ్వాసం, సానుకూల భావన పెరుగుతుందని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది. కానీ తరచూ ఇతరుల బట్టలు వేసుకోవడం వల్ల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరి బట్టలు ధరించకూడదు?
వాస్తు ప్రకారం ఈ వ్యక్తుల బట్టలు ధరించకపోవడం మంచిదని చెబుతారు.
ఎక్కువ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు
తీవ్ర మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్‌తో ఉన్నవారు
ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలతో ఉండేవారు
కొత్త బట్టలు, వాడిన బట్టల విషయంలో ఏం చేయాలి?
ఎవరైనా కొత్త బట్టలను బహుమతిగా ఇస్తే వాటిని ఎలాంటి సందేహం లేకుండా ధరించవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే వాడిన బట్టలు ధరించాల్సి వస్తే ముందుగా వాటిని చిటికెడు ఉప్పు కలిపిన నీటితో ఉతికి, బాగా ఆరబెట్టి తర్వాత ఉపయోగించాలని సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం వాస్తు శాస్త్రంలో పేర్కొన్న విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా మాత్రమే మీకు అందించడం జరుగుతోంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!