Share News

మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:35 AM

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్‌ గురువారం డ్రోన్లతో విరుచుకుపడింది. మాస్కో, దాని సమీప ప్రాంతాల్లో దాదాపు 200 డ్రోన్లు దాడి చేశాయి.

మాస్కోపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి

మాస్కో, జూన్‌ 18: రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్‌ గురువారం డ్రోన్లతో విరుచుకుపడింది. మాస్కో, దాని సమీప ప్రాంతాల్లో దాదాపు 200 డ్రోన్లు దాడి చేశాయి. మరో 1000కి పైగా డ్రోన్లు, నాలుగు క్రూయిజ్‌ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఇది రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కోపై జరిగిన అతిపెద్ద డ్రోన్‌ దాడిగా అధికారులు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడి అధికార నివాసం క్రెమ్లిన్‌కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఆయిల్‌ రిఫైనరీ లక్ష్యంగా దాడులు జరగడంతో అందులో పేలుళ్లు సంభవించి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడుల్లో 17 మంది గాయపడగా.. మరో చమురు డిపోపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు మాస్కో గవర్నర్‌ వెల్లడించారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు తీసుకురావడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.

Updated Date - Jun 19 , 2026 | 02:35 AM