Share News

నేడు పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 23 , 2026 | 05:00 AM

పాలిటెక్నిక్‌లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్‌-2026 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌లోని....

నేడు పాలిసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ పాలిసెట్‌-2026 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11.30గంటలకు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీదేవసేన ఈ ఫలితాలను విడుదల చేస్తారని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య వెల్లడించారు. విద్యార్థులు www.polycet.sbtet.telangana.gov.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చని సూచించారు. ఈ నెల 13న జరిగిన పాలిసెట్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 98,029 అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎల్‌పీ సెట్‌ ఫలితాలు కూడా శనివారం విడుదల కానున్నాయి. పాలిసెట్‌ ఫలితాల విడుదల కార్యక్రమంలోనే ఎల్‌పీ సెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు.

పీఈ సెట్‌ హాల్‌టికెట్ల విడుదల

బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ)తో పాటు పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగే తెలంగాణ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (పీఈ) సెట్‌ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు http://pecet.tgche.ac.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను పొందవచ్చు. ఈ ఏడాది ఈ పరీక్ష కోసం 3,300 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజేష్ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 నుంచి జూన్‌ 3 వరకు ఫిజికల్‌, స్కిల్‌ టెస్ట్‌లను కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ మైదానంలో నిర్వహించనున్నారు.

Updated Date - May 23 , 2026 | 05:00 AM