రేపు పాలిసెట్-2026 పరీక్ష
ABN , Publish Date - May 12 , 2026 | 03:48 AM
డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్-2026ను బుధవారం నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. పాలిసెట్‌కు....
నిమిషం లేటైనా అనుమతించం: సాంకేతిక విద్యామండలి
డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్-2026ను బుధవారం నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 1,06,439మంది దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం 293 పరీక్షాకేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుండగా, అభ్యర్థులను గంటముందే పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఒక నిమిషం లేటుగా వచ్చినా అభ్యర్థులను లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్షాకేంద్రం లొకేషన్‌ను తెలుసుకునేందుకు ఎస్‌బీటీఈటీ టీజీ యాప్‌ను వినియోగించుకోవాలని పుల్లయ్య కోరారు.