ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:30 AM
గత నెలలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు..
ఫస్టియర్‌లో 69, సెకండియర్‌లో 49 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): గత నెలలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు పరీక్షల ఫలితాలను ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 2,67,331 మంది విద్యార్థులు హాజరవ్వగా 1,84,042 (69ు) మంది పాసయ్యారు. వీరిలో అబ్బాయిల ఉత్తీర్ణత శాతం 63 శాతం ఉండగా, అమ్మాయిలు 76 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండో సంవత్సరంలో 1,31,128 విద్యార్థులకు 64,639 (49శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అబ్బాయిల ఉత్తీర్ణత 48 శాతం, అమ్మాయిల ఉత్తీర్ణత 53 శాతంగా ఉంది. సెకండియర్‌లో గ్రూపుల వారీగా చూస్తే.. ఎంపీసీలో 50.45, ఎంఈసీలో 37.65, బైపీసీలో 56.04, సీఈసీలో 41.25, హెచ్‌ఈసీలో 49.32 శాతం ఉత్తీర్ణత నమోదయింది. సెకండియర్‌లో గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది 51 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ కోసం పేపరుకు రూ. 100, రీ వెరిఫికేషన్‌కు రూ. 800 చొప్పున ఈనెల 18లోపు చెల్లించాలని అధికారులు తెలిపారు.