Share News

నేడు టీఎస్‌ ఎడ్‌సెట్‌

ABN , Publish Date - May 12 , 2026 | 03:49 AM

రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం మంగళవారం టీఎస్‌ ఎడ్‌సెట్‌-26 పరీక్ష నిర్వహించనున్నారు.

నేడు టీఎస్‌ ఎడ్‌సెట్‌

కేయూ క్యాంపస్‌, మే 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం మంగళవారం టీఎస్‌ ఎడ్‌సెట్‌-26 పరీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 59 ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌, బి. వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలుంటాయని వెల్లడించారు. అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే రెండు గంటలు ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

Updated Date - May 12 , 2026 | 03:49 AM