13, 14 తేదీల్లో టీజీ ఐ-సెట్
ABN , Publish Date - May 12 , 2026 | 03:45 AM
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్-2026 నిర్వహించనున్నట్లు కన్వీనర్ అల్వాల రవి తెలిపారు.
నల్లగొండ, మే 11(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ నెల 13, 14 తేదీల్లో టీజీ ఐసెట్-2026 నిర్వహించనున్నట్లు కన్వీనర్ అల్వాల రవి తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఐ-సెట్‌కు 56,223మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 13వ తేదీన మొదటి విడతలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు, 14వ తేదీన మొదటి విడత ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దివ్యాంగులు, ఉర్దూ విద్యార్థులకు 13వ తేదీ మధ్యాహ్నం రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విడతలో పరీక్ష రాసే విద్యార్థులను ఉదయం 8.30నుంచి, రెండో విడతలో విద్యార్థులను 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మొదటి విడత పరీక్ష రాసే విద్యార్థులను 9.45గంటల తర్వాత, రెండో విడత విద్యార్థులను 1.45గంటల తర్వాత పరీక్షాకేంద్రం లోనికి అనుమతించేది లేదని ఐ-సెట్ కన్వీనర్ స్పష్టం చేశారు.