Share News

పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

ABN , Publish Date - Mar 05 , 2026 | 02:16 AM

పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం విడుదల చేసింది. ఈ హాల్‌ టికెట్లను అన్ని పాఠశాలలకు పంపామని...

పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం విడుదల చేసింది. ఈ హాల్‌ టికెట్లను అన్ని పాఠశాలలకు పంపామని, అధికారిక వెబ్‌సైట్‌ www. bse.telangana.gov.in నుంచి కూడా విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని డైరెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్‌ సేవలు కూడా అందుబాటులో ఉంచామని, 8096958096 వాట్సాప్‌ నంబరుపై సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14న ప్రారంభమై ఏప్రిల్‌16న ముగియనున్నాయి. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 5,28,239 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Updated Date - Mar 05 , 2026 | 02:16 AM